రోడ్డుపై వెళ్తుండగా దొరికిన పర్సు.. ఓనర్‌ని ట్రాక్ చేసేందుకు ఎన్నికష్టాలు పడ్డాడో.. నిజంగా గ్రేట్

రాహుల్ పర్సుతో తైమూర్ (Image:Twitter)

పర్సు దక్కడంతో రాహుల్ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఎంతో కష్టపడి తన పర్సు అప్పగించిన ఘూజీ తైమూర్​కు అతడు కృతజ్ఞతలు తెలిపాడు.

  • Share this:
మనం ఏదైనా వస్తువును పోగొట్టుకుంటే ఒక పది, పదిహేను రోజులు దాని గురించి వెతుకుతాం. ఆలోపు దొరక్కపోతే దానిపై ఆశలు వదిలేసుకుంటాం. లండన్​లో ఉద్యోగం చేస్తున్న రాహుల్​ అనే భారత సంతతి వ్యక్తి కూడా ఇలాగే పర్సు పోగొట్టుకున్నాడు. అందులో బ్యాంకు కార్డులు, గుర్తింపు కార్డులు వంటి విలువైన డాక్యుమెంట్స్​ ఉన్నాయి. ఆ పర్సు కోసం ఎంతగా వెతికినా ఫలితం లేదు. దీంతో ఆశలు వదులుకున్నాడు రాహుల్​. అయితే ఇదే సమయంలో రాహుల్ పోగొట్టుకున్న​ పర్సు ఘూజీ తైమూర్ అనే వ్యక్తికి దొరికింది. ​అతడు రాహుల్​కు ఎలాగైనా పర్సు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. అతడి అడ్రస్​ కనుక్కునేందుకు శతవిథాలా ప్రయత్నించాడు. సోషల్ మీడియా సహాయంతో రాహుల్​ను కనుగొని పర్సు అప్పగించాడు. ఈ ప్రయాణాన్ని ట్విట్టర్​ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. సినిమాటిక్​ స్టైల్​లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఘూజీ తైమూర్​ నిజాయితీని అంతా ప్రశంసిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ హెడ్‌గా పనిచేస్తున్న ఘాజీ తైమూర్​ లండన్‌లోని ఒక వీధిలో నడుస్తుండగా పర్సు దొరికింది. అయితే ఆ పర్సులోని బ్యాంకు కార్డుపై ఉన్న పేరు ప్రకారం అది రాహుల్​కి చెందిందని నిర్ధారించుకున్నాడు. దీంతో అతని అడ్రస్​ కనుక్కునేందుకు సోషల్ మీడియాలో వెతికాడు. ముందుగా పర్సు దొరికిన విషయాన్ని ట్విట్టర్​లో షేర్​ చేశాడు. అక్కడి నుంచి ఈ ప్రయాణంలో ప్రతి సందర్భాన్ని ట్వీట్​ చేసుకుంటూ వెళ్లాడు. మొదటగా రాహుల్​ పూర్తి పేరుతో ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లో ఉన్న అకౌంట్లను పరిశీలించాడు. కానీ ఎక్కడా అతని పేరిట అకౌంట్​ ఉన్నట్లు కనిపించలేదు.

ఆ తర్వాత గూగుల్​లో వెతికాడు.. అయితే ఆ పేరు గల వ్యక్తులు గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించాడు. కానీ, అది వారిలో అసలైన ఓనర్​ ఎవరో గుర్తుపట్టడం కష్టంగా మారింది. దీంతో జాబ్​ పోర్టల్​ లింక్డ్‌ఇన్​లో వెతికాడు. చివరగా రాహుల్​ లండన్‌లోని ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీలో పనిచేస్తున్నాడని గుర్తించాడు. కానీ ప్రైవసీ సెట్టింగుల కారణంగా మెసేజ్ చేయలేకపోయాడు. దీంతో రాహుల్​ పనిచేస్తున్న కంపెనీ అడ్రస్​ కోసం గూగుల్​లో వెతికాడు. కానీ ఎక్కడా అడ్రస్​ కనిపించలేదు. అయినప్పటికీ, తన వేటను కొనసాగించాడు. కంపెనీ అడ్రస్​ కనుగొనేందుకు UK కంపెనీలన్నీ రిజిస్ట్రర్ చేసుకునే కంపెనీ హౌస్‌ ఏజెన్సీని సంప్రదించాడు. ఎట్టకేలకు అక్కడ రాహుల్​ పనిచేసే కంపెనీ అడ్రస్​ కనుక్కున్నాడు. అక్కడికి వెళ్లి రాహుల్‌ను కలుసుకుకొని నేరుగా పర్సు అప్పగించాడు.

ఘూజీ తైమూర్​పై నెటిజన్ల ప్రశంసలు..
తన పర్సు దక్కడంతో రాహుల్ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఎంతో కష్టపడి తన పర్సు అప్పగించిన ఘూజీ తైమూర్​కు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఘూజీ తన ప్రయాణంలోని ప్రతి సందర్భాన్ని బాలీవుడ్ రిఫరెన్స్‌లను ఉపయోగించుకుంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఘూజీ నిజాయితీని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ జర్నీతో ఏకంగా ఒక బాలీవుడ్ సినిమా తీయవచ్చని నెటిజన్లు కామెంట్లలో పేర్కొంటున్నారు.

Keywords
Published by:Shiva Kumar Addula
First published: