MANIPUR ELECTIONS 2022 SMRITI IRANI DANCES WITH FOLK ARTISTS DURING CAMPAIGNING IN IMPHAL PVN
Manipur Polls : ఎన్నికల ప్రచారంలో స్మృతీ ఇరానీ డ్యాన్స్..అదరగొట్టింది చూడండి
డ్యాన్స్ చేసిన స్మృతీ ఇరానీ
Smriti Irani dance : స్మృతీ ఇరానీ డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా...అక్కడ ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రిని మరింత ఉత్సాహపరిచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Smriti Irani dances : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 28న పోలింగ్ జరుగనున్న మణిపూర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పాల్గొన్నారు. శుక్రవారం ఇంఫాల్ ఈస్ట్‌లోని వాంగ్ఖీ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జానపద కళాకారులతో కలిసి స్మృతి ఇరానీ నృత్య ప్రదర్శన చేశారు. అక్కడి మహిళలు వేసుకునే వస్త్రాలను ధరించి సంప్రదాయ నృత్య కళాకారులతో కలిసి స్మృతీ ఇరానీ డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా...అక్కడ ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రిని మరింత ఉత్సాహపరిచారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మణిపూర్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH | Union Minister Smriti Irani joins artists performing traditional dance at an event in Wangkhei area of Imphal East, Manipur pic.twitter.com/jQtqKMkOJW
ముణిపూర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ గురువారం మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో మణిపూర్ ప్రజలకు వరాలు ప్రకటించారు. ప్రతిభావంతులైన మహిళా కళాశాల విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు, సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ రూ. 1000కి పెంచడం, పారిశ్రామిక వేత్తలకు రూ. 25 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడానికి రూ. 100 కోటల స్టార్ట్ అప్ మణిపూర్ ఫండ్ ను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. Rani Gaidinliu Nupi Maheiroi Singi స్కీం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల బాలికలకు రూ. 25 వేలు ఇస్తామని హామీనిచ్చింది.
ప్రధాన మంత్రి ఉజ్వల పథకం లబ్దిదారులకు సంవత్సరానికి రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని,12వ తరగతి ఉత్తీర్ణులై ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ ల్యాప్ టాప్ లు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న సన్నకారు, చిన్న మరియ భూమి లేని రైతుల పిల్లలకు స్కాలర్ షిప్ లు అందచేస్తామన్నారు. ఈ సందర్బంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. రాష్ట్రంలో మత్తు పదార్దాలను అరికట్టడంతో సీఎం విజయవంతమయ్యారని కొనియాడారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.