Home /News /trending /

MAN WHO TRIED TO PLAY PRANK WITH LION GO A UNEXPECTED LESSON VIDEO BECOME VIRAL AK

OMG: సింహంతో ఆటలా ?.. తేడా వస్తే ఇలాగే ఉంటది మరి.. వైరల్ వీడియో

సింహం బోను వేలు పెట్టిన యువకుడు (Twitter Image)

సింహం బోను వేలు పెట్టిన యువకుడు (Twitter Image)

Viral Video: అప్పటివరకు అతడి చేష్టలను వీడియో తీస్తున్న అతడి స్నేహితులు.. సింహ అతడి వేలును పట్టుకున్నా.. అదే రకంగా వీడియో తీయడం కొసమెరుపు.

    సింహంతో ఆటలు ఆడొద్దు. ఏ మాత్రం అదుపు తప్పినా.. సింహం తన తడాఖా ఏంటో చూపిస్తుంది. అయితే ఏదో వైరల్ వీడియో, ప్రాంక్ వీడియో చేయడానికి అలవాటు పడ్డ కొంతమంది.. తాము ఏం చేస్తున్నామో.. ఎవరితో అలా చేస్తున్నామో అనే విషయం తెలియకుండా మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లు అనుకున్నట్టు జరిగితే ఓకే కానీ.. ఏ మాత్రం తేడా వచ్చినా సీన్ మారిపోతుంది. ఆఫ్రికాలోని జమైకా జూలో సేమ్ టు సేమ్ ఇలాంటి సీన్ ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా సింహం ఉన్న బోను దగ్గరికి వెళ్లి.. దాన్ని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ఇందుకోసం చాలా సేపు ప్రయత్నించాడు.

    సింహానికి కోపం వస్తోందనే విషయాన్ని అతడు ఏ మాత్రం గమనించలేకపోయాడు. అది బోనులో ఉందని.. తాను బయట ఉన్నాననే ఉద్దేశ్యంతో ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నాడు. అతడు అనుకున్నది కొద్దిసేపు అనుకున్నట్టుగానే జరిగింది. అయితే అతడి పిచ్చిచేష్టలను కొంతసేపు భరించిన సింహం.. అదును చూసుకుని అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. మళ్లీ జీవితంలో మరోసారి అతడు ఏ క్రూరమైన జంతువుతో ఇలా చేయకుండా చేసింది.



    విషయం ఏమిటంటే.. సింహం బోను పదే పదే వేలు పెడుతూ దాన్ని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. అతడి చేష్టలను అతడితోపాటు వచ్చిన అతడి స్నేహితులు కొందరు వీడియోలు తీశారు. అయితే ఉన్నట్టుండి అతడి చేతి వేళ్లను సింహం తన నోటికి పట్టుకుంది. అంతే... అప్పుడు కానీ సింహం అంటే ఏమిటో మనోడికి తెలియలేదు. సింహం చేతికి చిక్కిన తన చేతి వేళ్లని బయటకు లాక్కునేందుకు అతడు ఎంతో ప్రయత్నించాడు.

    Trending: పాకిస్థాన్‌లోనూ శ్రీలంక కష్టాలు.. దేశం ముందు 3 మార్గాలు.. లాక్‌డౌన్ పెట్టబోతున్నారా ?

    Viral Video : దళితుడి నోట్లోని ఆహారాన్ని తీసి తిన్న ఎమ్మెల్యే

    కానీ అక్కడ వేలు పట్టుకుంది సింహం కదా.. అంత ఈజీగా మనోడు ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఏదో రకంగా గాయాలతో తన వేళ్లను బోను నుంచి బయటకు లాక్కోవడంతో ఆ యువకుడు సక్సెస్ అయ్యాడు. అయితే అప్పటివరకు అతడి చేష్టలను వీడియో తీస్తున్న అతడి స్నేహితులు.. సింహ అతడి వేలును పట్టుకున్నా.. అదే రకంగా వీడియో తీయడం కొసమెరుపు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Trending news, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు