హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral: యువకుడిగా కనిపించేందుకు తండ్రి, కొడుకుతో రక్త మార్పిడి.. కోట్లు ఖర్చు పెడుతున్న వ్యక్తి

Viral: యువకుడిగా కనిపించేందుకు తండ్రి, కొడుకుతో రక్త మార్పిడి.. కోట్లు ఖర్చు పెడుతున్న వ్యక్తి

Image: Bryan johnson twitter

Image: Bryan johnson twitter

యుక్త వయసులో కనిపించినంత యవ్వనంగా ఉండటం దాదాపు అసాధ్యం. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఒక టెక్ వ్యవస్థాపకుడు (Tech Entrepreneur) తలచాడు. అందుకు ఏకంగా సంవత్సరానికి రెండు మిలియన్ల డాలర్లను ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాడు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Viral: టీనేజ్ వయసులో, ముఖ్యంగా 18 ఏళ్లు ఉన్నప్పుడు ఎవరైనా సరే చాలా యవ్వనంగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఈ వయసు దాటిపోతున్న కొద్దీ అందం తగ్గుతుంది. ఇక 40 ఏళ్ల వయసు వచ్చాక.. యుక్త వయసులో కనిపించినంత యవ్వనంగా ఉండటం దాదాపు అసాధ్యం. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఒక టెక్ వ్యవస్థాపకుడు (Tech Entrepreneur) తలచాడు. అందుకు ఏకంగా సంవత్సరానికి రెండు మిలియన్ల డాలర్లను ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాడు. అంతేకాదు, తన తండ్రి, కొడుకుతో కలిసి రక్తమార్పిడి చేయించుకుంటున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 3న టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్, అతని తండ్రి రిచర్డ్ (70), కొడుకు టాల్మేజ్‌ (17)తో కలిసి, డల్లాస్ సమీపంలోని ఒక క్లినిక్‌కు వెళ్లారు. తర్వాత వారు బ్లడ్ ప్లాస్మాను మార్పిడి చేసి, మూడు-తరాల (Tri-generational) రక్త మార్పిడి ప్రక్రియలో పాల్గొన్నారు. ఉదయాన్నే వచ్చి వీరు ఈ పని చేశారు.

ఈ ప్రక్రియలో మొదటగా టాల్మేజ్ ఒక లీటర్ రక్తాన్ని దానం చేస్తాడు. ఆ బ్లడ్ ప్లాస్మా, రక్త భాగాలుగా ప్రాసెస్ అవుతుంది. బ్రయాన్ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాడు, అలాగే తన కొడుకు టాల్మేజ్ ప్లాస్మాను తన రక్తనాళాలలోకి ఎక్కించుకుంటాడు. ఇక రిచర్డ్ తన రక్తం కాస్త బయటకు తీసేసి.. దాని స్థానంలో బ్రయాన్ ప్లాస్మాను పొందుతాడు.

ఈ ప్రాసెస్ అంతా "బ్లడ్ బాయ్స్" కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది. టెక్ ఇండస్ట్రీకి చెందిన వారితో సహా కొందరు యవ్వనం కోసం యువ రక్తాన్ని తమకు ఎక్కించుకోవడం ద్వారా ప్రయోగాలు చేశారు. దీనివల్ల యవ్వనంగా మారతారని అనడానికి ఇప్పటివరకైతే శాస్త్రీయ ఆధారాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు.

Viral: ఉమ్మి అమ్మి లక్షల సంపాదన.. ఆమె వాడిన దుస్తులు,బెడ్‌షీట్స్‌కు ఫుల్ డిమాండ్‌..!

బ్రయాన్ గుర్తు తెలియని ఒక హెల్తీ డోనార్ నుంచి ప్లాస్మాను స్వీకరించడానికి క్రమం తప్పకుండా క్లినిక్‌ని వెళ్తాడు. తన మునుపటి వెంచర్‌ను విక్రయించిన తర్వాత, అతను కెర్నల్‌ను స్థాపించాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌పై దృష్టి సారించాడు. వైద్య నిర్ధారణలు, చికిత్సలు, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం లేదా తిరిగి యువకుడిగా మారడం వంటి వాటి కోసం అతడు ప్రత్యేకమైన జీవనశైలి కోసం మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నాడు. జాన్సన్ పబ్లిక్ తాను చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు.

కరోనా సమయంలో ప్లాస్మా మార్పిడి చేశారనే సంగతి మనకు తెలిసిందే. ఎలుకలలో చేసిన ప్రయోగాలు యవ్వనాన్ని తేవడంలో ప్లాస్మాను కీలకంగా ఉంటుందని తెలిపాయి. అయినా, మానవ అధ్యయనాలు పరిమితంగా ఉన్నాయి. చాలా మంది పరిశోధకులు ఈ సాక్ష్యాలను అసంపూర్తిగా పరిగణిస్తున్నారు. ఎలక్టివ్ ప్లాస్మా మార్పిడి పట్ల జాగ్రత్త వహించమని సూచిస్తున్నారు. కాగా జాన్సన్ వైద్య బృందం జ్ఞాన క్షీణతకు, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధులను నివారించడానికి మెరుగైన చికిత్సగా ప్లాస్మా మార్పిడిని ఆమోదించింది.

జాన్సన్ తన రక్తం, మెదడు, అవయవ పనితీరును క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ రక్తమార్పిడి వల్ల వచ్చే మార్పులను అంచనా వేస్తున్నాడు. తన ఆరోగ్య పద్ధతులను మెరుగుపరచడానికి దీర్ఘాయువు సాంకేతికతను, శాస్త్రీయ అన్వేషణను ఇలా ప్రారంభించాడు. ఈ ప్రక్రియలో ఒక లీటరు రక్తాన్ని సంగ్రహించడం, భర్తీ చేయడం, సుమారు 80 నిమిషాలు పడుతుంది. జాన్సన్ ఇందుకు డల్లాస్‌లోని రీసర్జెన్స్ వెల్‌నెస్ అనే మెడికల్ స్పాను ఎంచుకున్నాడు. కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, రాబోయే క్లినిక్ విజిటింగ్ గురించి జాన్సన్, అతని కుటుంబం ఉత్సాహంగా ఉన్నారు.

First published:

Tags: VIRAL NEWS

ఉత్తమ కథలు