సుడి బాగుంది... ఉద్యోగం పోయి... రూ.31 కోట్ల లాటరీ గెలిచాడు

ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ లాటరీ గెలిచినా... అది కచ్చితంగా థ్రిల్ ఇస్తుంది. ఎందుకంటే... అది వారి జీవితాల్ని మార్చేస్తుంది. అలాంటి ఓ అదృష్టవంతుడి కథ ఇది.

news18-telugu
Updated: August 1, 2020, 10:09 AM IST
సుడి బాగుంది... ఉద్యోగం పోయి... రూ.31 కోట్ల లాటరీ గెలిచాడు
సుడి బాగుంది... ఉద్యోగం పోయి... రూ.31 కోట్ల లాటరీ గెలిచాడు (credit - facebook)
  • Share this:
భూమిపై కరోనా వచ్చాక... చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు కదా... అతను కూడా ఆ లిస్టులో చేరాడు. ఆస్ట్రేలియా, పెర్త్‌లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం పోయింది. తన మూడేళ్ల కూతురి కోసం కొన్ని నిత్యవసర సరుకులు కొన్నాడు. అలా వెళ్తుంటే... లాటరీవెస్ట్ అనే గుర్తు కనిపించింది. దాన్ని చూడగానే... ఎందుకో మనసులో... ఓ టికెట్ కొనేయ్ అని అనిపించింది. దురదృష్టవంతుణ్ని... దేవుడు కరుణిస్తాడేమో చూద్దాం అనుకుంటూ టికెట్ కొన్నాడు. ఆ తర్వాత కష్టాల్లో పడి లాటరీ సంగతి మర్చిపోయాడు. తాజాగా అక్కడి ఓ న్యూస్ ఏజెన్సీ... లాటరీ టికెట్ ఫలితాల్ని చూపించింది. గెలిచిన నంబర్‌ను చూపించింది. తన దగ్గర ఉన్న టికెట్‌పై ఏ నంబర్ ఉందో... అనుకుంటూ అటకపై ఉన్న టికెట్ తీసి చూశాడు. ఎగ్జాక్ట్‌లీ అదే నంబర్... ఆశ్చర్యపోయాడు. నమ్మలేకపోయాడు. అది నిజమా, కాదా అని మళ్లీ మళ్లీ చూసుకున్నాడు. అతని ఆనందానికి ఆకాశమే హద్దైంది.

తిన్నగా లాటరీ సెంటర్‌కి వెళ్లాడు. తన టికెట్ చూపించాడు. వాళ్లు ఎంతో ఆనందపడ్డారు. లక్కీ పర్సన్ అంటూ మెచ్చుకున్నారు. "ఇప్పుడు నువ్వు ఇంత డబ్బు గెలిచావు కదా ఏం చేస్తావ్ అని అడిగితే... "ఇంటికి వెళ్లి... నా కూతుర్ని ఆనందంగా కౌగలించుకుంటాను" అన్నాడు. "జీవితం ఎప్పుడూ ఓ కలలాంటిది అని నమ్ముతాను. లొట్టో విన్నర్లలో నేనుండటం నాకు ఓ కలే" అన్నాడు.


మొత్తం రూ.31 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలన్నది ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. కష్టాల్లో ఉన్న తన అన్నయ్యకు కొంత ఇవ్వాలనుకుంటున్నాడు. అతని కోసం ఓ ఇల్లు కొంటానంటున్నాడు. తాను మధ్యలో ఆపేసిన కామర్స్ డిగ్రీని ఇప్పుడు పూర్తి చేస్తానంటున్నాడు. ఇల్లుకొనుక్కొని తన తల్లికి ఓ కారు కొంటానంటున్నాడు.

మేలో ఇలాగే ఓ న్యూజిలాండ్ వ్యక్తికి 47.7 కోట్ల లాటరీ దక్కింది. మరో ఘటనలో ఉద్యోగం కోల్పోయిన మహిళకు రూ.96.23 లక్షల లాటరీ లభించింది. ఆమె ఫేస్ మాస్కులు కుట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో లాటరీ టికెట్ కొనుక్కుంది.
Published by: Krishna Kumar N
First published: August 1, 2020, 10:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading