భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తైన మహిళలు అర్ధరాత్రి రోడ్లపై నడవటం కాదు కదా..పట్టపగలు బజారులో నిల్చోలేని పర్థితి నెలకొంది. ఎటునుంచి ఎవరొస్తారో ..ఎవరి ఏ యాసిడ్ బాటిల్‌తో మహిళలపై దాడి చేస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది. బీహార్(Bihar)లో ఓ యువకుడు అరాచకుడి అవతారమెత్తాడు. నడిరోడ్డుపై ఆసుపత్రి ముందు నిల్చున్న ఓ మహిళను గట్టిగా పట్టుకొని బలవంతంగా ముద్దు( Kissed)పెట్టుకున్నాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరా(CC Camera)లో రికార్డైంది. ఇప్పుడు ఈవీడియోనే సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. బాధితురాలు తనపై దారుణానికి ఒడిగట్టిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకునే పనిలో పడ్డారు.
సీరియల్ కిస్సర్..
బీహార్‌లో పోకిరి వెదవలు కొందరు మహిళల్ని భయాబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్డు పక్కన, బస్టాండ్‌లో నిల్చున్న మహిళలో మెడల్లో నగలు, గొలుసులు లాక్కెళ్లే వాళ్లను చూశాం. కాని జాముయి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఆసుపత్రిలో పని చేస్తున్న హెల్త్ వర్కర్ నిల్చొని ఉండగా షడన్‌గా అక్కడికి వచ్చిన ఓ యువకుడు ..ఆమెను గట్టిగా పట్టుకొని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. సదరు బాధితురాలు ప్రతిఘటిస్తున్నప్పటికి విడిచిపెట్టకుండా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రి గోడ దూకి పారిపోయాడు. ఈదృశ్యం అక్కడే అమర్చిన సీసీ కెమెరాలో రికార్డైంది.
పబ్లిక్ ప్లేసులో పాడు పని..
నాల్గో శ్రేణి ఉద్యోగినిగా పని చేస్తున్న బాధితురాలు తనపై జరిగిన అకస్మాత్తు చర్యకు షాకైంది. అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికి చిక్కకపోవడంతో వెంటనే నగరంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు పారిపోతున్న ఫోటోలను పోలీసులకు చూపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆస్పత్రి ఆవరణలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు మంచాల యువకుడని ఇంకా పరారీలో ఉన్నట్లుగా తెలిపారు.
వైరల్ అవుతున్నవీడియో..
ఈ కేసులో మహిళ ఉద్యోగిని పబ్లిక్ ప్లేసులో ముద్దుపెట్టుకున్న నిందితుడ్ని గుర్తించామని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్‌డిపి తెలిపారు. ఈ దుర్మార్గపు చర్యతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉండే మహిళా ఉద్యోగులు, హెల్త్ వర్కర్లు, పేషెంట్‌లు ఆసుపత్రి ప్రాంగణంలో నిల్చోవాలంటే భయపడిపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Crime news, Viral Video