Snake Bite: కాటేసిన పెంపుడు పాము.. కోరలు లేవు కదా.. ఏం చేయదనుకున్నాడు.. కానీ సీన్ రివర్స్

ప్రతీకాత్మక చిత్రం

పామును పెంపుడు జంతువుగా పెంచుకోవాలని అనుకున్నాడు ఓ వ్యక్తి. అనుకున్నదే తడవుగా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి మరీ ఓ సర్పాన్ని కొనుగోలు చేశాడు. దాన్ని ఇంట్లో పెట్టి పోషించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అది తన యజమానిని కాటేసింది.

  • Share this:
పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన కాటు వేయక మానదు అని మన పెద్దలు అంటుంటారు. దీనర్థం పాము పాలు తాగుతుందని కాదు. ఎంత ప్రేమగా పెంచినప్పటికీ దాని క్రూర లక్షణాన్ని ఎప్పుడోకప్పుడు చూపిస్తుందని భావం. ఈ నానుడి నిజమేనని చైనాలో జరిగిన సంఘటన నిరూపిస్తోంది. పామును పెంపుడు జంతువుగా పెంచుకోవాలని అనుకున్నాడు ఓ వ్యక్తి. అనుకున్నదే తడవుగా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి మరీ ఓ సర్పాన్ని కొనుగోలు చేశాడు. దాన్ని ఇంట్లో పెట్టి పోషించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అది తన యజమానిని కాటేసింది. చివరకు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాగ్ ప్రావిన్స్ కు చెందిన లియు అనే వ్యక్తి పామును పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆన్ లైన్ లో మీటరు పొడవుండే కోబ్రాను ఆర్డర్ చేశాడు. సాధారణంగా ఇలాంటి పెంపుడు పాములకు ముందుగానే కోరలు పీకి వినియోగదారులకు అందజేస్తారు. ఇదే విషయాన్ని అమ్మకదారుడు లియూకు కూడా చెప్పాడు. అనంతరం పామును లియూ అడ్రస్ కు డెలివరీ చేశారు. అప్పటి నుంచి లియూ ఆ పామును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ, పెంచుకుంటున్నాడు.

కోరలు తీయని పామును పంపిన విక్రేత..
అయితే ఓ రోజు లియూ మంచంపై నిద్రిస్తుండగా... ఆ పాము అతడిపై తొడపై కాటేసింది. వెంటనే చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు. తక్షణమే అప్రమత్తం కావడం వల్ల లియూ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పాము కోరల్లో విషముందని అప్పటికి గానీ తెలియలేదు. కాస్త ఆలస్యమైతే, పాము కాటు వేసిన శరీర భాగాన్ని తొలగించాల్సి వచ్చేదని, దీంతో పాటు ప్రాణం కూడా పోయి ఉండేదని వైద్యులు తెలిపారు.

పాముకు విషం ఉండటం ఏంటని లియూ, సంబంధిత విక్రేతను సంప్రదించాడు. తప్పు తమదేనని, పొరపాటున విషమున్న పామును డెలివరీ చేశామని అమ్మకందారుడు ఒప్పుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం బాధితుడి వంతైంది. దీంతో పామును పెంపుడు జంతువుగా పెంచుకోకూడదని అతడు నిర్ణయం తీసుకున్నాడు.

కరోనాకు, పాముకు సంబంధం ఉందా?
తమిళనాడు మధురై జిల్లాకు చెందిన వడివేలు(50) అనే రైతు, గత వారం చనిపోయిన పామును తిన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడు కట్ల పామును తిన్నట్లు గుర్తించారు. అటవీ శాఖ వడివేలుకు 7 వేల రూపాయల జరిమానా విధించింది. కోవిడ్-19కు విరుగుడు మందుగా భావించి తనను తాను రక్షించేందుకు గాను పామును తిన్నానని అతడు చెప్పాడు. అయితే పాము అప్పటికే చనిపోయి ఉండటం కారణంగా.. అతడు నమిలినా కోరల్లో విషం లేకపోవడం వల్ల బతికి బయటపడ్డాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published: