వివాహం జరుగున్న ఇల్లు అంటే సందడిగా, బంధు, మిత్రుల ఆట,పాటలతో కోలాహాలంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని వారణాసి(Varanasi)లో కూడా ఓ ఇంట్లో పెళ్లి బంధువులతో కళకళలాడిపోయింది. అయితే ఆ సందడి క్షణాల్లోనే విషాదంగా మారింది. ఊహించని విధంగా పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు మేళాలు వాయించాల్సిన విషాదకరమైన పరిస్థితి తలెత్తింది. పెళ్లికి వచ్చిన బంధువుల్ని చూసిన సంతోషంలో ఓ వ్యక్తి వాళ్లతో కలిసి డ్యాన్స్(Dance) చేస్తుండగానే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచాడు. ఇప్పడు ఈ వీడియోనే సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.
పెళ్లి ఇంట్లో విషాదం..
పెళ్లి ఇంట్లో చావు మేళం మోగుతుందని ఎవరూ ఊహించరు. శుభమా అంటూ పెళ్లి జరగుతున్న ఇంట్లో ఓ వ్యక్తి అందరితో సరదాగా గడుపుతూనే కుప్పకూలిపోయాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని చెట్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపిలాని కత్రాలో ఈఘటన చోటుచేసుకుంది. 40సంవత్సరాల విశ్వకర్మ అనే వ్యక్తి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. విశ్వకర్మలు కావడంతో బంధువులు, మిత్రులతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఇంటికి వచ్చిన బంధువుల్లో మహిళలు కొందరు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నారు. మనోజ్ విశ్వకర్మ కూడా సూటు, బూటు వేసుకొని వారితో స్టెప్పులు వేశాడు. ఇంతలోనే డ్యాన్స్ చేస్తూనే వెనక్కి పడిపోయాడు.
చూస్తుండగానే పోయిన ప్రాణం..
అప్పటి వరకు మనోజ్ డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొడుతున్న బంధువులు, కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మనోజ్ విశ్వకర్మను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే గుండె పోటు రావడంతో చనిపోయినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. సరదాగా గడుపుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంటి విషాదం నెలకొంది. ఈమధ్య కాలంలో ఇలాంటి మరణాలు ఎక్కువగానే జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. బాగా సంతోషం వచ్చినా..ఎక్కువ బాధ పడినా గుండె పోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Trending news, Uttarapradesh, Viral Video