హవాయ్ దీవుల్లో ఫేక్ వెకేషన్...వైరల్ అవుతున్న వీడియో

హవాయ్ దీవుల్లో తాను పర్యటిస్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫేక్ వీడియో...సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: July 23, 2019, 6:33 PM IST
హవాయ్ దీవుల్లో ఫేక్ వెకేషన్...వైరల్ అవుతున్న వీడియో
ఫేక్ వీడియోలో ఓ దృశ్యం
  • Share this:
అంతర్జాతీయ ప్రసిద్ధ పర్యాటక స్థలం- హవాయ్ దీవుల్లో పర్యటించే తాహతు లేకపోవడంతో ఓ యువకుడు ఊహాజనితమైన (ఫేక్) వెకేషన్ వీడియోను అనిమేషన్‌లో రూపొందించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానంలో బయలుదేరింది మొదలుకొని...హవాయ్ దీవుల్లో తాను తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోను అనిమేషన్ ఎఫెక్ట్స్‌తో తయారు చేశాడు లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఆ యువకుడు. తనకు హవాయ్ పర్యటనకు వెళ్లే తాహతు లేదు...అందుకే దీన్ని క్రియేట్ చేశానంటూ దీనికి కామెంట్ పెట్టాడు.

విమానంలో సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యాలు, యోగాసనాలు వేయడం, అగ్ని పర్వతం ఉప్పొంగడం, బీచ్‌లో విశ్రాంతి తీసుకోవడం, హవాయ్ సాంప్రదాయక నృత్యాలు వంటి అంశాలను అనిమేషన్‌లో రూపొందిన తీరు ఆకట్టుకుంటోంది.

52 సెకన్ల నిడివి కలిగిన ఈ అనిమేషన్ వీడియోను ఈ నెల 19న పోస్ట్ చేయగా...ఇప్పటి వరకు దాదాపు 7.62 మిల్లియన్ల మంది వీక్షించారు. రెండు లక్షల మందికి పైగా రీట్వీట్ చేశారు.అతను హవాయ్ వెకేషన్‌కి వెళ్లేందుకు ఎవరైనా సాయం చేస్తే బావుణ్నంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


బెస్ట్ అనిమేషన్ ఎడిటింగ్ కింద ఆ వ్యక్తికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ మరో నెటిజన్ రెకమెండ్ చేశాడు. ఇది తన చేత కంటతడి పెట్టించిందని ఓ నెటిజన్ పేర్కొన్నారు.

First published: July 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>