వామ్మో.. పామును ఫేస్ మాస్క్‌గా చుట్టుకున్నాడు.. వీడియో వైరల్

ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పామునే మాస్క్‌లా ధరించాడు. మెడకు చుట్టుకొని నోటిని కవర్ చేశాడు.

news18-telugu
Updated: September 18, 2020, 10:02 AM IST
వామ్మో.. పామును ఫేస్ మాస్క్‌గా చుట్టుకున్నాడు.. వీడియో వైరల్
పామును మాస్క్‌గా ధరించిన వ్యక్తి
  • Share this:
కరోనా వచ్చిన తర్వాత ఫేస్ మాస్క్‌ల వాడకం ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు రూల్ పెట్టడంతో.. అందరూ మాస్క్ పెట్టుకుంటున్నారు. మార్కెట్లో ఎన్నో రకాల మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎన్-98, క్లాత్ మాస్క్, డిస్పోజబుల్ మాస్క్, కర్చీఫ్‌లు..ఇలా రకరకాల డిజైన్లు, వెరైటీ వస్త్రాలతో మాస్క్‌లను ధరిస్తున్నారు ప్రజలు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పామునే మాస్క్‌లా ధరించాడు. మెడకు చుట్టుకొని నోటిని కవర్ చేశాడు. ఊహించుకుంటేనే భయానకంగా ఉన్న ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది.

ఇంగ్లండ్‌లో ఓ బస్సు స్వింటన్ నుంచి మాంచెస్టర్ వెళ్తోంది. అందరిలానే ఓ వ్యక్తి కూడా మాస్క్ ధరించి బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాడు. ఐతే అతడు ధరించి ఫేస్ మాస్క్ మాత్రం వెరైటీగా ఉంది. చూడడానికి కండువాలా ఉంది గానీ..పాము చర్మాన్ని పోలిఉంది. ఏముంది.. మార్కెట్లోకి ఎన్నో రకాల మాస్క్‌లు వచ్చాయి కదా.. ఇది కూడా అలాంటిదే అయి ఉంటుందని భావించారు. పాము లాంటి మాస్క్ కావచ్చని అనుకున్నారు. కానీ కాసేపటికే అది మెడపై నుంచి పాకుతూ.. అతడి చేతికి చుట్టుకుంది. ఆ దృశ్యాన్ని చూసి బస్సులోని ప్రయాణికులంతా షాక్ అయ్యారు. అది పాము లాంటి మాస్క్ కాదు. నిజంగా పామే..! పామునే అతడు మాస్క్‌లా చుట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. వీడు మాములోడు కాదంటూ.. ట్వీట్స్ చేస్తున్నారు. నువ్వు ఉండాల్సిన వాడివి సామీ.. అంటూ దండం పెడుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 18, 2020, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading