హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇదేందిరా అయ్యా.. భార్యలందరిదీ సెమ్ టెస్ట్.. నెట్టింట వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..

ఇదేందిరా అయ్యా.. భార్యలందరిదీ సెమ్ టెస్ట్.. నెట్టింట వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..

సరదాగా నవ్వుకుంటున్న వ్యక్తులు

సరదాగా నవ్వుకుంటున్న వ్యక్తులు

Viral video: భార్యలు తమ భర్తలతో కలిసి.. ఒక్కొక్కరుగా హోటల్ కు చేరుకుంటున్నారు. అక్కడున్న వారంతా .. లోనికి వస్తున్న మరికొందరిని చూస్తున్నారు. కొందరు పగలబడి నవ్వుకుంటున్నారు.

మనం తరచుగా షాపింగ్ మాల్స్ లో డ్రెస్సులు కొంటుంటాం. కొన్ని సార్లు.. ఒకే రకమైన డ్రెస్ లు, భిన్న రకాల సైజ్ లలో అందుబాటులో ఉంటాయి. మనం తీసుకున్న దుస్తులనే.. మరికొందరు కూడా తీసుకోవడం వంటిది కామన్ గా జరుగుతుంటుంది. ఒక్కొసారి సేమ్ డ్రెస్ లు వేసుకున్న వారే, ఎదురెదురు పడినప్పుడు కొంత మంది సరదాగా నవ్వుకుంటారు. మరికొంత మంది మాత్రం.. తమ లాంటి డ్రెస్ లు ఎవరు వేసుకోకుడదని భావిస్తుంటారు. తాము మాత్రమే స్పెషల్ గా ఉండాలని అనుకుంటారు. ఇతరులు తమకు మ్యాచింగ్ లా కన్పించే డ్రెస్ లు వేసుకుంటే అసలు ఒప్పుకోరు. అయితే.. కొన్ని సార్లు మాత్రం ఒకరు వేసుకున్న కాస్టూమ్ మరికొందరు కూడా వేసుకుంటుంటారు. ఇలాంటి వీడియో ప్రస్తుతం నెట్టింట (Social media)  వైరల్ గా (viral video)  మారింది.

పూర్తి వివరాలు.. కొంత మంది తమ భర్తలతో కలిసి సరదాగా గడపడానికి హోటల్ కు వెళ్లారు. అక్కడ ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. అక్కడ బఫెట్ లో కూర్చున్నారు. అప్పుడు.. ఒకరిద్దరు తెలుపు,నలుపు రంగు చారల టీషర్ట్ లను (Same Tshirt)  వేసుకున్నారు. అయితే.. వచ్చిన వారంతా అక్కడ చేర్ లో కూర్చున్నారు. వారు.. లోపలికి వస్తున్న వారిని చూసి పగల బడి నవ్వుకుంటున్నారు.


హోటల్ కు వస్తున్న వారంతా.. సెమ్ టీషర్ట్స్ వేసుకుని వస్తున్నారు. దాదాపు... అందరు అదే రంగులో ఉన్న టీషర్ట్ లు వేసుకుని వస్తుండటంతో, ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. అక్కడ ఉన్న భార్యలు కూడా, తమ లాగే అచ్చం మ్యాచింగ్ టీషర్ట్ లు వేసుకున్నారని పగలబడి నవ్వుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా (viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video

ఉత్తమ కథలు