Home /News /trending /

MAN WANTED TO RE ADMISSION IN MBBS THIRD YEAR WHICH HE LEFT OFF IN 1988 PAH

ఎంబిబిఎస్ అడ్మిషన్ కోసం కోర్టుకు వెళ్లిన బిజినెస్​ మెన్.. కారణం ఏంటంటే

గుజరాత్​ హైకోర్టు (ఫైల్ ఫోటో​)

గుజరాత్​ హైకోర్టు (ఫైల్ ఫోటో​)

వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తి తన చదువును మధ్యలోనే వదిలేశాడు. ఆ తర్వాత తిరిగి ప్రారంభించాలనుకున్నాడు. దీని కోసం కళాశాలకు వెళ్లి తిరిగి అడ్మిషన్​ (Admission) ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. కాలేజ్ యాజమాన్యం తిరస్కరించడంతో హైకోర్టు (High Court) వరకు వెళ్లాడు. ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...
చదువుకు వయసుతో పనిలేదంటారు. అందుకే కొందరు లేటు వయసులోను అనేక డిగ్రీలు, పీజీలు, పీహెచ్​డీలు చేస్తుంటారు. అయితే, మనకి కావాల్సిందల్లా చదువుకోవాలనే ఆసక్తి , శ్రద్ధ, అంకిత భావం మాత్రమే. కొందరు తమ వ్యక్తిగత కారణాల వలన, మరేదో సమస్యలతో చదువును మధ్యలోనే ఆపేస్తారు. ఆ తర్వాత చదువుపై ఆసక్తితో తిరిగి ప్రారంభిస్తారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుజరాత్​కు (Gujarat) చెందిన కందిప్​ జోషి ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు ప్రస్తుతం 50 ఏళ్లు. ఈ వయసులో.. చాలా మంది హయిగా ఇంట్లో కాలక్షేపం చేస్తు ఉండటానికి ఇష్టపడుతుంటారు. అయితే, కొందరు ఏవేవో కారణాలతో తమ చదువుకు ఆటంకం ఏర్పడితే మధ్యలోనే వదిలేస్తారు. మరికొంత మంది తాము.. గతంలో చదివిన.. చదువులను కూడా మరిచిపోతుంటారు.

కందిప్​ జోషి దీనికి భిన్నంగా ఆలోచించారు. ఆయన 31 ఏళ్ల క్రితం మధ్యలో వదిలేసిన తన ఎంబిబిఎస్​(MBBS Third Year) మూడో ఏడాది చదువును పూర్తిచేయాలనుకున్నారు. దీని కోసం ఆయన కోర్టుల వరకు కూడా వెళ్లారు. కందిప్​జోషి 1984వ సంవత్సరంలో గుజరాత్​లోని బరోడా మెడికల్​ కాలేజ్​లో ఎంబిబిఎస్ అడ్మిషన్​ తీసుకున్నారు.

వరుసగా మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంను పూర్తి చేశారు. అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. ఆయన చదువులో తోటి విద్యార్థుల కంటె ఎంతో ముందుండేవారు. ఈ క్రమంలో ఆయన తన ఎంబిబిఎస్ రెండవ సంవత్సరాన్ని 1988లో పూర్తిచేశారు. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆయన చదువుకు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయన డిప్రెషన్​లోకి వెళ్లారు.

ఈ నేపథ్యంలో ఆయన ఎంబిబిఎస్​ చదువు అర్థాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత.. వ్యాపార రంగంలో (Business) ప్రవేశించారు. వ్యాపారంలోను తనదైన మార్క్​ చూపించారు. అయితే, కందిప్​కు మధ్యలో నిలిపేసిన తన ఎంబిబిఎస్ మూడో ఏడాదిని పూర్తిచేయాలను కున్నారు.

దీనికోసం తాను అడ్మిషన్​ తీసుకున్న కాలేజ్​కి వెళ్లి సంప్రదించారు. అయితే, ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆయన విన్నపాన్ని బరోడా కళాశాల డీన్​ తిరస్కరించారు. దీంతో ఆయన కళాశాలపై 2‌‌013లో గుజరాత్​ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

ప్రస్తుతం ఆ కాలేజ్ మెడికల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియాగా (Medical Council Of India) మారింది. కాగా, పిటిషన్​ను విచారించిన కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా ఒక విద్యా సంవత్సరం చదివే క్రమంలో.. మధ్యలో ఐదేళ్ల కన్నా ఎక్కువ గ్యాప్​ ఉండకూడదనే నియమం ఉందని తెలిపింది.

కందిప్​ జోషి ఎంబిబిఎస్​(MBBS Third Year) చదువు మధ్యలో డ్రాప్​ అయి.. 31 ఏళ్లు గడిచిపోయినట్లు తెలిపింది. గతంలో ఉన్న సిలబస్​ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆయనకు కావాల్సివస్తే తిరిగి ఎంబిబిఎస్ మొదటి ఏడాది నుంచి తిరిగి అడ్మిషన్​ తీసుకుని చదువు ప్రారంభించవచ్చని సూచించింది.

తొలుత కళాశాల నిర్ణయంపైన వ్యతిరేకిస్తూ.. హైకోర్టుకు వెళ్లిన కందిప్​ ఆ తర్వాత కోర్టు తీర్పును సరైనదిగా భావించారు. ప్రస్తుతం కోర్టు ఈ మేరకు క్లయింట్​ తరపు న్యాయవాదికి సూచనలు జారీచేస్తు పిటిషన్​ను వాయిదా వేసింది. ప్రస్తుతం కందిప్​ జోషికి చదువుపట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Gujarat, Gujarat news, National

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు