అసలే చలికాలం.. పొద్దున్నే లేవాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అన్ని కాలాల మాదిరి శీతాకాలం కొంచెం బద్దకం ఎక్కువ. వేకువజామున ముఖ్యమైన పనులున్నాయంటే పెద్ద తలనొప్పిగా అనిపిస్తాయి. అందుకే అలారం పెట్టుకోవడం తప్పనిసరి. అయితే కొన్నిసార్లు చలిదెబ్బకు అలారం కూడా పనిచేయదు. ఇలాంటి పరిస్థితుల్లో పని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇందుకు విభిన్నంగా ఆలోచించాడు. పొద్దున్నే లేవడం కోసం పాతకాలపు పద్ధతి మాదిరి కోడి కూసేలా ఏర్పాట్లు చేశాడు. అదేంటి కోడి బయట ఉంటుంది కదా.. అయినా ఈ రోజుల్లో ఏసీ గదుల వల్ల కోళ్లు కూసిన వినిపించట్లేదు కదా అనే సందేహాలు మీకు రావచ్చు. అందుకే కోడిపుంజునే పడక మంచం దగ్గర పెట్టుకున్నాడు. తాజాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కోడిపుంజును పడక మంచం దగ్గరగా అందులోనూ కూత చెవికి బాగా వినిపడేట్లు దాన్ని కట్టాడు. దీంతో సూర్యోదయానికి ముందే కోడిపుంజు కూత వినిపించి తన యజమానిని నిద్రలేపింది. కోడిపుంజు కూసే వీడియోను ప్రవీణ్ అంగుసామి అనే ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విధంగా అవసరాలకు అనుగుణంగా పరిస్థితులు మార్చుకునే వ్యక్తిత్వం మనందరకూ కావాలంటూ ట్విట్టర్లో వీడియోతో పాటు కామెంట్ పెట్టాడు.
అతడు షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వివిధ రకాల మాధ్యమాల ద్వారా వీడియో వైరల్ అయింది. చాలా మంది ఔత్సాహికులు కోడిపుంజును అలా ఉంచడం పట్ల విశేషంగా స్పందిస్తున్నారు.
చూసిన ప్రతిఒక్కరూ విభిన్నంగా స్పందించడమే కాకుండా నవ్వుకుంటున్నారు. కొందరైతే అతడి తెలివిని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను డిసెంబరు 7న ప్రవీణ్ పోస్ట్ చేశారు. కొద్ది నిమిషాల్లో వందల సంఖ్యలో వీక్షణలు, లైక్స్ ను అందుకున్నారు. వీడియో గురించి చాలా మంది విశేషంగా స్పందిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:January 07, 2021, 20:38 IST