Viral mask video : కరోనా మహమ్మారి(Covid19) మరోసారి రెక్కలు విప్పుతోంది. గతంలో కూడా ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు. ప్రస్తుతం పలు దేశాల్లో మరోసారి వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాను నివారించడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధాలు శానిటైజర్‌లు. మాస్క్‌లు. అయితే మాస్క్ ల(Fask masks) విభిన్న డిజైన్‌లు, బ్రాండ్‌లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అలాంటి వింత మాస్క్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఫేస్ మాస్క్ పెట్టుకున్న తర్వాత వచ్చే అతి పెద్ద సమస్య ఏమిటంటే.. తినేటప్పుడు, త్రాగేటప్పుడు దాన్ని తొలగించడం. అయితే ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకునే తినగలిగే,తాగగలిగేటువంటి మాస్క్ ని తయారు చేసాడు. ఈ మాస్క్ ను తొలగించకుండానే తినవచ్చు, నీరు కూడా త్రాగవచ్చు. ఈ మాస్క్‌కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది, దీనిపై ప్రజల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు దీన్ని క్రియేటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా పిలుస్తుంటే, మరికొందరు చాలా విచిత్రంగా ఉందని అంటున్నారు.
Bulls like me feeding on stocks today despite the covid fears after wearing mask. pic.twitter.com/W9LB2QRjSc
— Safir (@safiranand) December 23, 2022
Chanakya niti : ఇలాంటి వ్యక్తులు ఇతరుల ఎమోషన్స్ ని అసలు పట్టించుకోరు!
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి రెస్టారెంట్‌లో కూర్చుని ఉన్నాడు. ముక్కు లాంటి ముసుగు అతని ముఖం మీద ఉంది. ఈ డిజైన్‌ను మనం అర్థం చేసుకునే సమయానికి, తినడానికి వ్యక్తి ఎదురుగా ఏదో వస్తుంది. అతను చాలా వింతగా మాస్క్ తీయకుండా స్నాక్స్, ఇతర వస్తువులను తినడం ప్రారంభిస్తాడు. ఈ వీడియో ఎక్కడిది, ఎప్పుడు రికార్డయింది అనేది తెలియలేదు కానీ, జనాలు మాత్రం చాలా సరదాగా చూస్తున్నారు. ఈ ఆసక్తికరమైన వీడియో @safiranand అనే ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయబడింది. ఈ వీడియోకు లక్షల వ్యూస్, వేల లైక్ లు వస్తున్నాయి.. ఈ వింత మాస్క్ ఆలోచనను చూసిన తర్వాత నెటిజన్లు కొందరు నవ్వుతూ ఎమోజీతో స్పందిస్తుండగా, మరికొందరు దీనిని డ్రామా అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Face mask, Viral Video