Man Uses Funny Trick To Keep Cool During power cuts: చాలా చోట్ల ఎండలు జనాలను ఇరగదీస్తున్నాయి. ప్రతి రోజు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలు ఎండ నుంచి (Summer Heat) తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పాటిస్తున్నారు. కొందరు ఏసీలు, కూలర్ లను ఉపయోగిస్తుంటే, మరికొందరు ఫ్యాన్ లను వాడుతున్నారు. ఇక కొన్ని చోట్ల అవసరం ఉంటే తప్ప బయటకు రావడానికి సాహాసించడం లేదు. తప్పని పరిస్థితులలో బయటకు వస్తే.. అలాంటి వారు.. కొబ్బరి నీళ్లు, జ్యూస్ ల వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.
కొందరు షాప్ లలో, తమ ఇళ్లలో ఒక్క నిముషం కూడా ఫ్యాన్, ఏసీలను ఆఫ్ లో ఉంచడం లేదు. అయితే, కొన్ని చోట్ల మధ్యాహ్నం సమయంలో కరెంట్ కోతలు ఉంటున్నాయి. ఆ సమయంలో మాత్రం ప్రజలు తీవ్రమైన ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. అయితే, ఒక వ్యక్తి మాత్రం కరెంట్ పోయినప్పుడు కాస్త అతి తెలివిని ప్రదర్శించాడు. సోషల్ మీడియాలో (Social media) ప్రతిరోజు వందల కొలది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వెరైటీను ఉంటాయి. ఈ వీడియోలను (Viral video) చూడటానికి నెటిజన్లు తెగ ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. ప్రస్తుతం ఒక ఫన్నీ వీడియో వైరల్ గా మారింది.
ये टेक्निक भारत से बाहर नहीं जानी चाहिये. pic.twitter.com/dUUF0BlGQ2
— Awanish Sharan (@AwanishSharan) April 29, 2022
పూర్తి వివరాలు.. ఒక వ్యక్తి తన ఇంట్లో మంచపై పడుకున్నాడు. అతను ఉక్కపోతకు తట్టుకోలేక తన ఒంటిపై కేవలం ఒక లుంగీ మాత్రమే వేసుకుని ఉన్నాడు. తన బెడ్ రూమ్ లో ఒక కిటికీ ఉంది. అదే విధంగా ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నాడు. ఇంతలో కరెంట్ పోయినట్టుంది. పాపం... మనోడు ఉక్కపోతను భరించలేక పోయాడు. చాలా సేపు కరెంట్ వస్తుందేమోనని ఎదురుచూశాడు.
కానీ ఎంత సేపటికి కరెంట్ రాలేదు. దీంతో ఒక ఐడియా వేశాడు. వెంటనే ఫ్యాన్ కు ఉన్న ముందు భాగంలోని ఐరన్ కప్పును తీసేశాడు. అప్పుడు.. టేబుల్ ఫ్యాన్ రెక్కలను తిప్పటం మొదలు పెట్టాడు. ఫ్యాన్ రెక్కలను తిప్పి.. వెంటనే బెడ్ మీద వెళ్లి పడుకున్నాడు. కాసేపు ఫ్యాన్ తిరిగి ఆగిపోయింది. అప్పుడు.. అతను.. తిరిగి మరలా ఫ్యాన్ రెక్కలను తిప్పి.. మరలా బెడ్ మీద పడుకున్నాడు. ఈ ఫన్నీ వీడియోను ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ (IAS officer Awanish Sharan)తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. నెటిజన్లు మనోడి తెలివిని చూసి నవ్వుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Funny video, Power cuts, Summer, Viral Videos