Home /News /trending /

MAN USES FRYING PAN TO DEFEND HIMSELF AGAINST AGGRESSIVE CROCODILE SENDS IT BACK INTO THE WILD VIDEO GOES VIRAL PAH

దోసా పాన్ ను ఇలా కూడా వాడోచ్చా..?.. మొసలికి దిమ్మతిరిగే షాక్.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్..

వ్యక్తిపై దాడిచేస్తున్న మొసలి

వ్యక్తిపై దాడిచేస్తున్న మొసలి

Australia: అనుకొకుండా మొసలి ఇంటి ఆవరణలో వచ్చింది. అంతటితో ఆగకుండా వ్యక్తిపై దాడిచేయడానికి ప్రయత్నించింది. వెంటనే అతను మొసలికే షాక్ ఇచ్చాడు.

కొన్ని సార్లు నీటిలో ఉండే మొసళ్లు (Crocodile)  ఒడ్డుకు వస్తుంటాయి. సాధారణంగా చెరువులు, సరస్సులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో.. తరచుగా ఒడ్డుకు వస్తుంటాయి. కొన్ని సార్లు.. మనుషుల కంట పడతాయి. అప్పుడు అవి దాడులకు పాల్పడతాయి. మరికొన్ని సార్లు.. దారితప్పి ఇళ్లవైపు వచ్చిన మొసలిని అధికారులు పట్టుకుని తిరిగి వాటిని నీళ్లలో వదిలేస్తారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో చూశారు. తాజాగా, ఒక మొసలి ఒడ్డుకు వచ్చింది. వచ్చిరావడంతోనే.. వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది.

పూర్తి వివరాలు.. ఆస్ట్రేలియాలో (Australia)  ఒక వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఆస్రటేలియా ప్రాంతంలోని ల్యాండ్ డౌర్ లో ఈ ఘటన జరిగింది. అక్కడి నార్తర్న్ టెరిటరీ పబ్ కు చెందిన యజమానిపై మొసలి దాడి చేయడానికి ప్రయత్నించింది. వెంటనే అతను చాకచక్యంగా ప్రవర్తించాడు. తన చేతిలోని దోసా ప్యాన్ తో (Man uses frying pan)  మొసలిపై ముఖంపై చితకొట్టాడు. ఆ పబ్ చెరువుకు సమీపంలో ఉంటుంది. అక్కడ తరచుగా మొసళ్లు ఒడ్డుకు వస్తుంటాయి. అయితే.. అతను తన చేతిలోని దోసా ప్యాన్ తో మొసలి ముఖంపై కొట్టాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్  నెట్టింట వైరల్ గా మారింది.



ఇదిలా ఉండగా ఒక యువతి నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసింది.

మహారాష్ట్రలో  (Maharashtra) ఈ ఘటన జరిగింది. ముంబైలోని హైవేపై ఒక యువతి (Girl drink) తప్పతాగి రోడ్డుమీదకు వచ్చింది. అక్కడ వచ్చిపోయే వాహానాలను ఆపుతూ.. నానా రచ్చ చేసింది. దీంతో అక్కడి వారు ఆమెను వారించడానికి చూశారు. కానీ ఆమె తాగిన మైకంలో (Alcohol addict)  అందరిని తిడుతూ, హంగామా చేసింది. అయితే, ఒక పోలీసు అధికారి ఆ మార్గం గుండా వెళ్తున్నారు. వెంటనే తన వాహానాన్ని ఆపి యువతికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ యువతి మరింత రెచ్చిపోయింది. ఏకంగా పోలీసు అధికారి కాలర్ పట్టుకుంది. ఆ తర్వాత.. మద్యం మత్తులు ఇష్టమోచ్చినట్టు బూతులు తిడుతూ.. తన్నడానికి ప్రయత్నించింది.

అంతటితో ఆగకుండా.. పోలీసు అధికారి ధరించిన మాస్క్ ను కూడా తీసిపాడేసింది. విధుల్లో ఉన్న అధికారిపై అగౌరవంగా ప్రవర్తించింది. స్థానికులు ఆమెకు ఎంత చెప్పిన ఆమె వినించుకొవడం లేదు. ఈక్రమంలో.. అక్కడ ఉన్నవారు.. యువతి ప్రవర్తిస్తున్న తీరును తమసెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Viral video)  ఈ వీడియో తెగ హల్ చల్ చేస్తుంది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Australia, Crocodile, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు