news18
Updated: October 15, 2020, 10:48 AM IST
- News18
- Last Updated:
October 15, 2020, 10:48 AM IST
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు భలే విచిత్రంగా ఉంటాయి. పలువురు చేసే విన్యాసాలు, వారి హావభావాలు, ఏదైనా సరే.. అందులో పెడితే వైరలే. ఇక వింత వింత చేష్టలు చేసేవారి వీడియోలు పెడితే ఆ వీడియోలు, అందులోని మనుషులకు మాములు క్రేజ్ రాదు. దేశంలో గత కొంతకాలంగా ఫేమస్ అయినవాళ్లు చాలా మంందే ఉన్నారు. ఈ కోవలోనే మరో పెద్దమనిషి జత కలిశాడు.
అలాంటి ఇలాంటి సాహసం కాదండోయ్.. ఏకంగా జేసీబీతోనే వీపు గోక్కున్నాడు మరి.
కేరళకు చెందిన ఒక నెటిజన్ ఈ వీడియోను ఫేస్బుక్ లో షేర్ చేశాడు. వీడియోలో ఒక వ్యక్తి.. వీపు లో దురదగా ఉంటే తువ్వాలుతో గోక్కుంటాడు. అటు నుంచి కొంచెం దూరం నడుస్తూ.. పక్కనే ఉన్న జేసీబీ కిందకి వెళ్తాడు. అంతే.. జేసీబీ ఆ పెద్దాయన వీపును అటు ఇటూ అంటూ ఉంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఈయన మాములోడు కాదు అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మరి ఆ వీడియో మీద మీరూ ఓ లుక్కేయండి.
గతంలోనూ ఒక జేసీబీ వ్యాన్ నుంచి మహిళలను కిందికి దించే వీడియో కూడా వైరలైంది. వ్యాన్ నుంచి కిందికి దిగడానికి ఇబ్బంది పడుతున్న మహిళలను.. జేసీబీ ముందు భాగంలో ఉండే డబ్బాలో కూర్చుండబెట్టి.. వారిని కిందికి దింపే వీడియో అప్పట్లో వైరలైన విషయం విదితమే.
Published by:
Srinivas Munigala
First published:
October 15, 2020, 10:46 AM IST