హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: RTCబసులో ప్రయాణికురాలి సీటుపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి ..తర్వాత ఏమైందంటే

OMG: RTCబసులో ప్రయాణికురాలి సీటుపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి ..తర్వాత ఏమైందంటే

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Shocking News:కర్నాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తాగిన మైకంలో తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. సీటులో నిద్రపోతున్న యువతిపై మూత్రవిసర్జన చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించే సమయంలో విచక్షణ, మర్యాదగా ప్రవర్తించాలనే విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. కొందరు నిర్లక్ష్యంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ..మరికొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేస్తున్నారు. కర్నాటక(Karnataka)లో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.విజయపూర(Vijayapura)నుంచి మంగుళూరు(Mangalore)కు వెళ్తున్న నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులో సీటులో నిద్రపోతున్న ప్రయాణికురాలిపై బస్సులో ప్రయాణిస్తున్న 32సంవత్సరాల గలేష్ యడవాడ్(Galesh Yadawad) అనే వ్యక్తి మూత్ర విసర్జన(Urination)చేశాడు. హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులో ఓ దాబా దగ్గర టీ తాగేందుకు డ్రైవర్ బస్సు ఆపాడు. ప్రయాణికులు కొందరు టీ తాగడానికి మరికొందరు మూత్ర విసర్జన చేయడానికి దిగారు. అదే సమయంలో చివరి సీటులో కూర్చున్న యువకుడు మద్యం మత్తులో ఈ సిగ్గుమాలిన పని చేశాడు. 20సంవత్సరాల వయసున్న యువతి సీటు దగ్గరకు వచ్చి ఆమె నిద్రపోతుండగా మూత్రవిసర్జన చేశాడు. దీంతో మహిళ గట్టిగా అరవడంతో బస్సు దిగిన ప్రయాణికులు అతడికి దేహశుద్ది చేసి బస్సులోంచి దింపేశారు.

మహిళపై మూత్రం పోశాడు..

కర్నాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తాగిన మైకంలో తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. సీటులో నిద్రపోతున్న యువతిపై మూత్రవిసర్జన చేశాడు. ఈవార్త మంగళవారం అర్ధరాత్రి జరిగింది. విజయపూర నుంచి మంగుళూరుకు వెళ్తున్నKA-19F-3554నెంబర్ కలిగిన స్లీపర్ నాన్ ఏసీ బస్సులో ఇంజనీరింగ్ చదివిన యువకుడు చివరి సీట్లో కూర్చున్నాడు. బస్సు హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరు దగ్గరకు రాగానే డ్రైవర్ టీ తాగడానికి బస్సు ఆపాడు. ఆ సమయంలో షడన్‌గా బస్సు ఆగడంతో మద్యం మత్తులో ఉన్న యువకుడు సీటులోంచి కొంద దూరం నడిచి ..బస్సులో నిద్రోపోతున్న మహిళపై మూత్రం పోశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు అతడ్ని పట్టుకొని చితక్కొట్టారు. పోలీసులకు అప్పగించేందుకు ప్రయత్నించగా మహిళ ఫిర్యాదు చేయడానికి నిరాకరించింది. దీంతో అతడ్ని లాగేజీతో పాటు కిందకు దింపారు.

తన్ని తరిమేసిన ప్రయాణికులు..

తాగిన మైకంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన యువకుడి సీటు నెంబర్ 28 ఉండగా ..మూడో నెంబర్ సీటులో కూర్చున్న యువతిపై నిద్రమత్తులో ఈ అసభ్యకరమైన పని చేశాడని తోటి ప్రయాణికులు కర్నాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాళ్లను బస్సుల్లో ఎక్కిస్తే మహిళలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగిన వాళ్లను ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించుకోవద్దని విన్నవించుకుంటున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు కూడా బాధితురాలు కంప్లైంట్ ఇవ్వని కారణంగానే చర్యలు తీసుకోలేదని లేదంటే విడిచిపెట్టమని సమర్దించుకున్నారు. ఎయిర్‌ ఇండియా విమానంలో ఇదే విధంగా ఓ వ్యక్తి మహిళ సీటుపై మూత్రవిసర్జన చేసిన ఘటన మర్చిపోక ముందే మరోకటి ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది.

First published:

Tags: Karnataka, VIRAL NEWS

ఉత్తమ కథలు