Video: బురదలోంచి వెళ్లేటప్పుడు జాగ్రత్త. ఈ వీడియోలో ఏమైందంటే..

బురదలోంచి వెళ్లేటప్పుడు జాగ్రత్త (image credit - twitter - the sun)

Video: చెరువైనా, చిన్న కాలువైనా, బురదైనా ఏదైనా సరే... దిగితేనే దాని లోతెంత అనేది తెలుస్తుంది. అతని విషయంలో జరిగింది ప్రతి ఒక్కరికీ ఓ హెచ్చరికే.

  • Share this:
    Video: మనందరికీ కామన్ సెన్స్ ఉంటుంది. సముద్రాల్లో లోతు ఎక్కువగా ఉంటుందనీ, నదుల్లో సుడి గుండాలు ఉంటాయనీ,... చెరువులు కాలువల్లో బురద ఉంటుందనీ ఇలా ప్రతి దానిపై ఓ అంచనా ఉంటుంది. ఆ అంచనా తప్పితే తేడా వస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి... ఓ వైపు నుంచి మరోవైపుకి వెళ్లాల్సి ఉండగా... అక్కడో చిన్న బురద నీరు ఉంది. దాంతో... చెప్పులు తీసి... చేత్తో పట్టుకొని... ఉత్తి కాళ్లతో బురదలోంచీ నడిచి వెళ్లిపోదాం అనుకున్నాడు. కానీ... అలా బురదలో కాలు పెట్టాడో లేదో... పూర్తిగా అందులో మునిగిపోయాడు.

    లక్కీగా అదేమీ సుడిగుండమో, ఊబి లాంటిదో కాదు. మామూలు గొయ్యే. అందువల్ల అతను తిరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. ది సన్... ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 1.23 లక్షల మంది చూశారు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.


    ఈ ఘటన జరిగినప్పుడు ఓ వ్యక్తి దీన్ని మొబైల్ ద్వారా షూట్ చేశారు. బురదలో పడిన వ్యక్తి పైకి లేచాక... షూట్ చేసే వ్యక్తి నవ్వడాన్ని వినవచ్చు. అతనికి తెలిసే ఈ విషయం ముందుగా చెప్పలేదా, కావాలనే అలా బురదలో పడేలా ఆట పట్టించాడా అనే డౌట్ నెటిజన్లకు వస్తోంది. చూస్తుంటే అదో వ్యవసాయ భూమిలా ఉంది. వర్షం పడటంతో... గొయ్యిలోకి నీరు వచ్చేసింది. అక్కడ గొయ్యి ఉన్నట్లే అనిపించట్లేదు.

    ఇది కూడా చదవండి: Video: రోడ్డు దాటుతున్న చేపలు.. వీడియో హల్‌చల్

    మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జోరు వానలు పడ్డాయి. చాలా చోట్ల ఏది గొయ్యో, ఏది రోడ్డో తెలియట్లేదు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. అందుకు ఈ వీడియో మనకు అప్రమత్త హెచ్చరిక అనుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: