MAN UNEARTHS HIS FIRST EVER GOLD COIN IT TURNS OUT TO BE A SUPER RARE ONE WORTH RS 6 5 CRORE GH VB
Rare Gold Coin: అతడు సరదాగా అలా నడుచుకుంటూ వెళ్లాడు.. కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా అంటే..?
కాయిన్ (Credit:bnps)
ఓవర్‌నైట్‌లోనే అదృష్టం వరించి కోటీశ్వరులు కావడమంటే మాములు విషయం కాదు. కోటిలో ఎవరికో ఒకరికి అంత అదృష్టం(Luck) పడుతుంది. అది కూడా ఎప్పుడు ఎలా వరిస్తుందనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు సాధారణంగా అనిపించే సంఘటనలే తర్వాత అసాధారణంగా మారతాయి.
ఓవర్‌నైట్‌లోనే అదృష్టం వరించి కోటీశ్వరులు కావడమంటే మాములు విషయం కాదు. కోటిలో ఎవరికో ఒకరికి అంత అదృష్టం(Luck) పడుతుంది. అది కూడా ఎప్పుడు ఎలా వరిస్తుందనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు సాధారణంగా అనిపించే సంఘటనలే తర్వాత అసాధారణంగా మారతాయి. బ్రిటన్‌కు చెందిన ఓ మెటల్ డిటెక్టర్‌ను(metal detectorist) ఇలాంటి అదృష్టమే వరించింది. అతనికి పురాతనమైన బంగారు నాణెం(Gold coin) దొరికింది. దాని విలువ అక్షరాల ఆరున్నర కోట్ల రూపాయాలు(6,48,000 పౌండ్లు) కావడం విశేషం. దీంతో అతడి సుడి తిరిగింది.వివరాల్లోకి వెళ్తే.. యూకేలోని డెవాన్‌లో మైఖేల్ లీగ్ మల్లోరి అనే గోల్డ్ హంటర్‌కు విలువైన బంగారు నాణెం దొరికింది. అది అతడికి దొరికిన మొదటి నాణెం కావడం విశేషం. వృత్తిరీత్యా మెటల్ డిటెక్టర్ అయిన మైఖేల్‌కు పురాతన నాణేలు సేకరించడమంటే ఎంతో ఇష్టం. 52 ఏళ్ల మైఖేల్ సెప్టెంబరు 2021లో పురాతన నాణేలు సేకరించడం మొదలుపెట్టాడు. అయితే అప్పుడే అతడికి ఓ పొలంలో తన మొదటి బంగారు నాణెం దొరికింది.
గోల్డ్ కాయిన్ దొరికినప్పుడు దాని విలువ మైఖేల్‌కు తెలియదు. అనంతరం నాణెం ఫొటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయగా.. స్పింక్ అనే వేలం సంస్థ ప్రతినిధుల నుంచి కాల్ వచ్చింది. అతడు కనుగొన్న బంగారు నాణెంపై ఉన్న రాజు మూడో హెన్రీ అని, సింహాసనంపై కూర్చున్న బొమ్మ నిజమైందని వారు తెలిపారు. ఉత్తర ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న బంగారంతో 1257 సంవత్సరంలో విలియం ముద్రించాడని మిర్రర్ నివేదిక పేర్కొంది. ఇది చాలా అరుదైన నాణెమని, ఇలాంటివి ఎనిమిది మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది.
దీంతో మైఖేల్ అదృష్టం మామూలుగా పండలేదు. వేలంలో ఆ బంగారు నాణెం రూ.6.5 కోట్లకు అమ్ముడుపోయింది. వేలంలో విక్రయించిన అత్యంత విలువైన ఇంగ్లీష్ కాయిన్‌గా రికార్డు సృష్టించింది. అయితే ఈ కాయిన్‌కు కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరును చెప్పడానికి ఇష్టపడలేదని వేలం సంస్థ తెలిపింది. తన వివరాలు గుప్తంగా ఉంచాలని కోరారని తెలిపింది. అయితే ఈ కాయిన్‌ను ఓ మ్యూజియానికి రుణంగా ఇస్తానని తెలిపినట్లు తెలుస్తోంది.
మైఖేల్ విషయానికొస్తే వేలంలో వచ్చిన సొమ్మును పొలం యజమానితో కలిసి చెరి సగం పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ సొమ్మును తన 13 ఏళ్ల కూతురు ఎమిలీ, 10 ఏళ్ల కుమారుడు హ్యారీ చదువుల కోసం ఉపయోగిస్తానని చెప్పాడు. "నా కథలో నా పిల్లలు భాగం. ఈ నాణెం గురించి స్పింక్, ఇతర విద్యాసంస్థలు చేపట్టిన పరిశోధన ద్వారా మాకు అందించిన ఆవిష్కరణ తదుపరి చరిత్రతో ముడిపడి ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. ఈ డబ్బును నా పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తాను" అని అతడు తెలిపాడు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.