HOME »NEWS »TRENDING »man travels 2000 kilometres to meet girl who he met online but she put him in jail ms

ఆన్లైన్ లో కలిసిన అమ్మాయి.. ఆమెను కలవడానికి 2 వేల కిలోమీటర్లు ప్రయాణించిన అబ్బాయి.. కానీ..

ఆన్లైన్ లో కలిసిన అమ్మాయి.. ఆమెను కలవడానికి 2 వేల కిలోమీటర్లు ప్రయాణించిన అబ్బాయి.. కానీ..
ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచం మొత్తం మన చేతి వేళ్ల కింద ఉన్న కాలమిది. కర్నాటక, ఉత్తరప్రదేశ్ పెద్ద దూరమా..? ఆ ఇద్దరూ ఆన్లైన్ లో కలుసుకున్నారు. పరిచయం కాస్తా ప్రేమైంది. ఈ క్రమంలో అమ్మాయి బర్త్ డే వచ్చింది. అమ్మాయికి సర్ప్రైజ్ ఇద్దామని మనోడు కర్నాటక నుంచి బయల్దేరాడు. కానీ తీరా అమ్మాయి దగ్గరికి వెళ్లే సరికి..

 • News18
 • Last Updated: January 13, 2021, 15:43 IST
 • Share this:
  ‘ప్రేమకథలు విషాదాంతాలు’ అని ఏ మహానుభావుడు అన్నాడో గానీ.. నూటికి తొంబై శాతం ప్రేమ కథలు విషాదాన్నే మిగుల్చుతున్నాయి. ఇదిగో ఈ కథ కూడా అలాంటిదే. అతడిది కర్నాటక రాజధాని బెంగళూరు. ఆమెది ఉత్తరప్రదేశ్ లోని మారుమూల గ్రామం. అతగాడు చేసేది చిరుద్యోగం. ఆ అమ్మాయి చదువుకుంటున్నది. ఒకరకంగా ఇదో నార్త్, సౌత్ లవ్ స్టోరీ. ఇద్దరికీ ఒకరంటే ఒకరు తెలియదు. అసలు కలుసుకునే సంబంధమే లేదు. కానీ సామాజిక మాధ్యమాల పుణ్యమా అని.. ప్రపంచం మొత్తం మన చేతి వేళ్ల కింద ఉన్న కాలమిది. కర్నాటక, ఉత్తరప్రదేశ్ పెద్ద దూరమా..? ఇద్దరు ఆన్లైన్ లో కలుసుకున్నారు. పరిచయం కాస్తా ప్రేమైంది. ఈ క్రమంలో అమ్మాయి బర్త్ డే వచ్చింది. అమ్మాయికి సర్ప్రైజ్ ఇద్దామని మనోడు కర్నాటక నుంచి అన్నీ సర్దుకుని బయల్దేరాడు. కానీ తీరా అమ్మాయి దగ్గరికి వెళ్లే సరికి మాత్రం స్క్రీన్ ప్లే మొత్తం మారింది.

  అసలు వివరాల్లోకెళ్తే... బెంగళూరు కు చెందిన సల్మాన్ చిరుద్యోగి. కొంతకాలం క్రితం ఆన్లైన్ లో ఒక యువతి పరిచయమైంది. ఆమెది ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లా లోని ఖేరి గ్రామం. ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరుచూ గంటల తరబడి చాటింగ్ లు, టాకింగ్ లు, వీడియో మీటింగులూ.. అబ్బో చాలా అయ్యాయి లెండి. ఈ క్రమంలోనే ఈ నెల 10 న ఆమె పుట్టినరోజు వచ్చింది. ఇదే విషయాన్ని ఆ యువకుడితోనూ చెప్పింది. మరి హీరోయిన్ బర్త్ డే అంటే హీరో సర్ ప్రైజ్ చేయాలిగా. అదీ ఆన్లైన్ బంధమాయే. మాములుగా ఉండదు మరి...  ఆ యువతికి తెలియకుండా తనను సర్ ప్రైజ్ చేద్దామని బెంగళూరు నుంచి బయల్దేరాడు సల్మాన్. దూరం 2 వేల కిలోమీటర్ల పైమాటే. బెంగళూరు నుంచి లక్నో దాకా విమానంలో వెళ్లాడు. అక్కడ్నుంచి లఖింపూర్ కు బస్సులో.. లఖింపూర్ నుంచి ఆ యువతి ఉండే గ్రామానికి ఆటోలో వెళ్లి ఆమె ఇంటి ముందు వాలాడు. కూడా తెచ్చుకున్న చాక్లెట్టు, టెడ్డీ బేర్ ఇచ్చి తన ప్రియురాలికి ప్రేమను పంచాలనుకున్నాడు. తనను చూడగానే తన హీరోయిన్.. పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకుంటుందని... ‘నన్ను కలుసుకోవడానికి ఇన్నాళ్లు పట్టిందా..’ అని బుంగమూతి పెట్టుకుంటుందేమో అనుకుంటూ ఒక డ్రీమ్ సీన్ వేసుకున్నాడు. కానీ విధి స్క్రీన్ ప్లే మరోలా రాసింది. ఆ యువతి ఇంటికి వెళ్లగానే... ఆమె ‘ఎవరండి మీరు...?’ అంది. అంతే.. మన హీరోకు గుండెలు బద్దలయ్యాయి. అతడ్ని చూడగానే ఇంట్లోంచి వచ్చిన ఆమె తల్లిదండ్రులు.. సల్మాన్ చెప్పింది కూడా వినకుండా రెండు చెంపలు చెడామడా వాయించారు.

  ఆపై అతడిని పోలీసులకు పట్టించారు. తనెవరో నాకు తెలియదని ఆ యువతి కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఆ యువకుడిపై సీఆర్పీసీ సెక్షన్ 151 కింద అభియోగాలు మోపుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ పై విడుదలైన సల్మాన్.. ట్రైయిన్ లో విషాద గీతాలు వింటూ బెంగళూరు కు చేరుకున్నాడు. అవునూ.. నిజమే.. ప్రేమకథలన్నీ విషాదాంతాలే...!!
  Published by:Srinivas Munigala
  First published:January 13, 2021, 15:43 IST

  टॉप स्टोरीज