విమానంలో పాసింజర్స్ ముఖాలకు ‘ఏదో’ పూసి దూకేసిన ప్రయాణికుడు

ఫ్లైట్‌లో ఉన్న యువకుడు అందులో ఉన్న ప్రయాణికుల ముఖాలను తాకుతూ వెళ్లాడు. వారి ముఖాల మీద ఏదో పూస్తూ వెళ్లాడు.

news18-telugu
Updated: April 14, 2019, 3:02 PM IST
విమానంలో పాసింజర్స్ ముఖాలకు ‘ఏదో’ పూసి దూకేసిన ప్రయాణికుడు
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫైల్
  • Share this:
విమానాల్లో ఈ మధ్య కాలంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు ప్రయాణికులు విమానంలో మద్యం తాగి రచ్చ చేయడం, ఇతరులతో గొడవపడడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే. మిన్నెపొలిస్ నుంచి ఫియోనిక్స్ స్కై హార్బర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1346 విమానంలో ఓ 25 ఏళ్ల వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. విమానం మరికొంత సేపట్లో లాండింగ్ కావలసి ఉంది. ఆ సమయంలో ఫ్లైట్‌లో ఉన్న యువకుడు అందులో ఉన్న ప్రయాణికుల ముఖాలను తాకుతూ వెళ్లాడు. వారి ముఖాల మీద ఏదో పూస్తూ వెళ్లాడు. ఆ యువకుడి విచిత్ర ప్రవర్తనపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఫ్లైట్ సహాయకులు అతడిని పట్టుకుని ప్రశ్నించారు. ప్రయాణికుల ముఖాల మీద ఏం రాశావని ప్రశ్నించారు. వెంటనే ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కోసం వెయిట్ చేస్తున్న సమయంలో విమానంలో ఉన్న ఆ వ్యక్తి అందులో నుంచి దూకేశాడు. ఆ సమయంలో విమానం భూమికి సుమారు 10 అడుగుల ఎత్తులో ఉంది. దీంతో అతడికి గాయాలయ్యాయి. పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలు అతడు ప్రయాణికుల ముఖాలపై ఏం రాశాడనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

First published: April 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు