Viral Video: ఓ వ్యక్తిని పోల్‌కు కట్టేసి చితకబాదిన మహిళ.. జనాలు చూస్తుండగానే విరుచుకుపడింది.. ఆమె ఎందుకలా చేసిందంటే..

వ్యక్తిని పోల్‌కు కట్టేసి చితకబాదిన మహిళ

దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట బాలికలు, మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.

  • Share this:
    దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట బాలికలు, మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు మృగాళ్లు అదే పనిగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తికి తగిన బుద్ది చెప్పింది. గ్రామస్తులు అందరూ చూస్తుండగానే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని చితకబాదింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. అయితే ఈ వైరల్ వీడియోను న్యూస్18 నిర్దారించలేదు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.

    బిహార్‌లోని (Bihar) ఖగాడియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. బెల్డార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని డుమ్రి గ్రామంలో మహిళలను వేధిస్తున్న వ్యక్తిని మహిళా స్తంభానికి కట్టేసింది. అనంతరం అతడిపై కర్రతో దాడి( Attack With Stick) చేసింది. అయితే అక్కడికి పెద్ద ఎత్తున గ్రామస్తులు.. ఈ దృశ్యాలను చూస్తుండిపోయారు. మహిళ మాత్రం తన పని తాను కానిచ్చింది. అతడిని కర్రతో కొడుతూనే ఉంది. మహిళ కొడుతున్న దెబ్బలు భరించలేక అతడు కేకలు వేశాడు. మధ్యలో కొందరు గ్రామస్తులు ఆమె చర్యను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అవేమీ పట్టించుకోకుండా మహిళ అతడిపై దాడి చేస్తూనే ఉంది.

    Hyderabad: ఆమె స్కూల్‌లో ఆయా.. బాత్‌రూమ్‌లో పిల్లాడిని లైంగికంగా వేధించింది.. కట్ చేస్తే..



    చివరకు మహిళను.. మరో మహిళ పక్కకు లాక్కెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అతడిపై గ్రామంలో పలువురు మహిళలను వేధించిన ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అతడికి శిక్ష విధించాలని మహిళ భావించింది.

    Viral Video: ట్రాక్టర్ టైర్ తల మీద నుంచి దూసుకెళ్లింది.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

    ఇక, గత ఏడాది దేశంలో జరిగిన నేరాలకు సంబంధించి నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(NCRB)-2020 నివేదిక ఇటీవల వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక ప్రకారం అత్యాచార కేసుల్లో టాప్‌లో రాజస్థాన్ రాష్ట్రం ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఉంది. 2019తో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాల్లో 24.65 శాతం తగ్గుదల కనిపిస్తుంది. ఇతర నగరాల్లో సైతం 8.3 శాతం తగ్గాయి. అయితే గతేడాది లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉండటం వల్ల నేరాలు కొద్దిమేర తగ్గుముఖం పట్టాయని భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో గృహహింస బాగా పెరిగింది.
    Published by:Sumanth Kanukula
    First published: