news18-telugu
Updated: January 13, 2021, 10:18 AM IST
Instagram image
ప్రాంక్ వీడియోలు, వాటికి అవతలి వారు ఇచ్చే రియాక్షన్లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూనే ఉంటాయి. చిత్రవిచిత్ర పనులతో చాలా మంది ప్రాంక్ చేసి అవతలి వారిని భయపెట్టడమో, ఆశ్చర్యపరచడమో చేస్తుంటారు. ఈ సమయంలో వారి రియాక్షన్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలకు విపరీతమైన బజ్ ఉంటుంది. వైరల్ అవుతాయి. తాజాగా ఇలాంటి ప్రాంక్ వీడియోనే ఒకరి బయటకు వచ్చింది. ఓ బాయ్ ఫ్రెండ్ చేసిన పనికి ఓ అమ్మాయి భయపడిపోయింది. తీవ్రంగా వణికిపోయింది.
లాన్స్ స్టివెర్ట్ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ జూలియా రష్‌పై ఈ ప్రాంక్ చేశాడు. రక్తంతో ఉన్న ఓ ఫేక్ కత్తిని తీసుకొని తలపై పెట్టుకున్నాడు. కత్తిపై ఉన్న బ్లడ్ రియల్‌గా అనిపించేలా ఉంది. ఆ తర్వాత తలలో పెద్ద కత్తి దిగినట్టు రక్తంతో అరుపులతో స్టివెర్ట్ రచ్చరచ్చ చేశాడు. దీంతో వెంటనే కిచెన్‌లోకి పరుగెత్తుకొచ్చిన జూలియా భయపడిపోయింది. ఆందోళన చెందింది. ఏం చేయాలో తెలియక ఏడ్చేసింది. వణికిపోయింది. వెంటనే ఫోన్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో జూలియా మరీ భయపడిపోతోందని గుర్తించిన స్టివెర్ట్ తలపై నుంచి డమ్మి కత్తిని తీశాడు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్టివెర్ట్ తన గర్ల్ ఫ్రెండ్‌కు సారీ చెప్పాడు. కాగా ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే 2.7 మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. కామెంట్లు, లైక్‌లతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు.
లాన్స్ స్టివెర్ట్ మంచి యాక్టర్ అవుతాడని, ఎక్సెలెంట్ ప్రాంక్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది నటుల కంటే అతడు బాగా యాక్ట్ చేస్తున్నాడని అన్నారు. అయితే గర్ల్ ఫ్రెండ్ ను మరీ ఎక్కువగా భయపెట్టాడని కొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరైతే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందంటూ కామెంట్ చేశారు.
Published by:
Krishna P
First published:
January 13, 2021, 10:18 AM IST