Happy New Year 2021: న్యూఇయర్ పార్టీకి ఇదేం అప్పురా బాబూ... ప్రామిసరీ నోట్ వైరల్

న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్

ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ప్రామిసరీ నోటులో ఉన్న అంశాల ప్రకారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లికి చెందిన బత్తిని సతీష్ అనే వ్యక్తి తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రాపూరి అంజి అనే వ్యక్తి దగ్గర రూ.15,000 అప్పు తీసుకుంటున్నట్టు రాశాడు.

  • Share this:
    డిసెంబర్ 31న పార్టీ కోసం ఓ వ్యక్తి అప్పు తీసుకున్నాడు. అయితే, అందులో వింత ఏముంది అంటారా? చాలా మంది అప్పు చేసి మరీ పార్టీ చేసుకుంటారు. ఆ తర్వాత తమ దగ్గర డబ్బులున్నప్పుడు తీర్చేస్తారు. అయితే, ఈ స్టోరీలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఓ వ్యక్తి తాను డిసెంబర్ 31న పార్టీ కోసం అప్పు తీసుకున్నాడు. అందుకోసం అప్పు తీసుకున్న వారికి ప్రామిసరీ నోటు కూడా రాసిచ్చాడు. సాధారణంగా అప్పులు తీసుకునే వారి దగ్గర కొందరు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, సామాన్యులు ఇలా ప్రామిసరీ నోట్లు రాయించుకుంటారు. కానీ, అందులో అప్పు ఎందుకు తీసుకుంటున్నారనే దానికి కారణాలు రాయరు. కేవలం ఎంత అప్పు తీసుకుంటున్నారు? ఎంత వడ్డీ? అప్పు ఇచ్చింది ఎవరు? అప్పు తీసుకున్నది ఎవరు అనే వివరాలతో పాటు స్టాంప్ మీద సంతకం చేయించుకుంటారు. అందుకు సాక్షులు కూడా సంతకాలు పెట్టించుకుంటారు. కానీ, ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి తాను డిసెంబర్ 31న దావత్ కోసం అప్పు తీసుకుంటున్నట్టు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు.

    ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ప్రామిసరీ నోటులో ఉన్న అంశాల ప్రకారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లికి చెందిన బత్తిని సతీష్ అనే వ్యక్తి తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రాపూరి అంజి అనే వ్యక్తి దగ్గర రూ.15,000 అప్పు తీసుకుంటున్నట్టు రాశాడు. అందుకు రూ.1.50 వడ్డీ కూడా ఉంది. దాని మీద ముగ్గురు సాక్షులు కూడా సంతకాలు చేశారు.

    డిసెంబర్ 31 దావత్ కోసం అప్పు తీసుకుని, అందుకు ప్రామిసరీ నోట్


    తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రజలు ఎవరూ వేడుకలు చేయవద్దని సూచించింది. కేవలం ఇంట్లోనే వేడుకలకు పరిమితం కావాలని స్పష్టం చేసింది. అయితే, రాత్రి 1 గంట వరకు బార్లు తెరిచేందుకు అనుమతి రావడం మాత్రం విమర్శలకు తావిచ్చింది. అదే సమయంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ చర్యలు చేపడుతున్నారు. ఈ రోజు రాత్రి మద్యం తాగి వాహనం నడిపే వారి మీద గట్టి చర్యలు తీసుకోనున్నారు. మద్యం తాగి డ్రైవ్ చేసేవారు టెర్రరిస్టులతో సమానం అంటూ ఇటీవల సైబరాబాద్ సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించడం గమనార్హం.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: