Viral News : దొంగను తెలివిగా పట్టించిన యువకుడు... వైరల్ వీడియో

Thief Caught Red Handed : పారిపోతున్న దొంగను పోలీసులు పట్టుకోలేని పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఓ యువకుడు తీసుకున్న నిర్ణయాన్ని పోలీసులు మెచ్చుకుంటున్నారు.

news18-telugu
Updated: February 17, 2020, 11:36 AM IST
Viral News : దొంగను తెలివిగా పట్టించిన యువకుడు... వైరల్ వీడియో
Viral News : దొంగను తెలివిగా పట్టించిన యువకుడు... వైరల్ వీడియో (credit - FB - Peachtree City Police Department and Peachtree City Fire Rescue)
  • Share this:
Thief Caught Red Handed : ఆ యువకుడు అంత వేగంగా, తెలివిగా ఆలోచించడం, టైమింగ్‌తో వ్యవహరించడాన్ని మెచ్చుకుంటున్నామని పోలీస్ శాఖ తెలిపింది. ఇంతకీ ఏమైందో తెలుసుకుందాం. జార్జియాలో ఓ దొంగ... ఓ మాల్‌లో చోరీ చేశాడు. పారిపోయేందుకు ప్రయత్నించాడు. చోరీ విషయం తెలిసిన పోలీసులు దొంగను పట్టుకోవడానికి వెంటపడ్డారు. పోలీసుల్ని చూసిన దొంగ... మెల్లగా పరుగు ప్రారంభించాడు. అది చూసిన పోలీసులు... ఏయ్... ఆగు నిన్నే... ఆగమంటుంటే... అంటూ అతని వెంటపడ్డారు. పోలీసులకు దొరకకూడదన్న ఉద్దేశంతో దొంగ వేగంగా పరుగెత్తసాగాడు. అప్పుడే అటుగా మాల్ నుంచీ సామాన్లు కొనుక్కొని... తమ కార్ల డిక్కీల్లో వాటిని పెట్టుకునేందుకు కొందరు వ్యక్తులు తమ సామాన్లను గ్రోసరీ కార్డుల్లో పెట్టుకొని తమతో తీసుకెళ్తున్నారు. ఎప్పుడైతే దొంగ తమవైపు పరిగెడుతూ వస్తున్నారో... సామాన్లు తీసుకెళ్తున్న కస్టమర్లలో ఓ యువకుడు... తెలివిగా తన సామాన్ల కార్టును దొంగవైపు జారవిడిచాడు. తన వెనక పరిగెడుతూ వస్తున్న పోలీసుల్ని చూస్తూ... దొంగ... తన ముందుకి అడ్డుగా వస్తున్న సామాన్ల కార్ట్‌ను చూసుకోలేదు. దానికి తగిలి... ఒక్కసారిగా కిందపడ్డాడు. అంతే పోలీసులు వెంటనే వచ్చి... అతన్ని పట్టుకున్నారు.


ఈ ఘటనలో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడినట్లు పీచ్‌ట్రీ పోలీసులు తేల్చారు. కార్ట్‌ను అడ్డుగా పెట్టి దొంగను పట్టించిన యువకుణ్ని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫుటేజ్‌ను ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేశారు. ఇందులో యువకుడు దొంగను పట్టించిన విధానం కనిపిస్తోంది. ఐతే... ఇలా ప్రతీ ఒక్కర్నీ తమ ఛేజింగ్‌లో సాయపడమని కోరట్లేదన్న పోలీసులు... ఆ సమయంలో యువకుడు అలా చెయ్యడం మాత్రం దొంగను పట్టుకోవడానికి వీలైందని అన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. దీన్ని చూస్తున్న చాలా మంది ఆ యువకుడి క్విక్ రెస్పాండ్‌ను మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు సొసైటీలో ఉంటే... దొంగల ఆటలు చెల్లవు అని అంటున్నారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు