హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral: ఇదేం పిచ్చిరా బాబూ..! నోకియా 3310 ఫోన్‌ను మింగిన వ్యక్తి.. తరువాత ఏమైందంటే..

Viral: ఇదేం పిచ్చిరా బాబూ..! నోకియా 3310 ఫోన్‌ను మింగిన వ్యక్తి.. తరువాత ఏమైందంటే..

ఎక్స్ రేలో కనిపిస్తున్న మొబైల్

ఎక్స్ రేలో కనిపిస్తున్న మొబైల్

వెర్రి వెయ్యి విధాలు అంటుంటారు పెద్దలు. ఇలాంటి వెర్రి పని చేసి వార్తల్లో నిలుస్తున్నాడు ఒక వ్యక్తి. కొసావోకు చెందిన ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అతడు ఒక నోకియా మొబైల్ ఫోన్‌ను అమాంతం మింగేశాడు. దాంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. తాను చేసిన పిచ్చి పని ప్రాణాలు తీసేస్తుందేమోననే భయంతో హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీశాడు. చివరకు ఏం జరిగిందంటే..

ఇంకా చదవండి ...

వెర్రి వెయ్యి విధాలు అంటుంటారు పెద్దలు. ఇలాంటి వెర్రి పని చేసి వార్తల్లో నిలుస్తున్నాడు ఒక వ్యక్తి. కొసావోకు చెందిన ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అతడు ఒక నోకియా మొబైల్(Nokia Mobile) ఫోన్‌ను అమాంతం మింగేశాడు. దాంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. తాను చేసిన పిచ్చి పని ప్రాణాలు తీసేస్తుందేమోననే భయంతో హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీశాడు. విషయం తెలుసుకున్న వైద్యులు అతడికి అత్యవసరంగా శస్త్ర చికిత్స చేసి ఫోన్‌ను బయటికి తీయడంతో పాటు బాధితుడి ప్రాణాలు కాపాడారు. ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసిన ఒక వైద్యుడు ఫేస్‌బుక్(Facebook) వేదికగా ఎక్స్ రే(X Ray), ఫోన్ ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొసావో(Kosavo) రాజధాని ప్రిస్టినాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి నోకియా(Nokia) 3310 ఫోన్ ను మింగేశాడు.

2000 కాలంలో విడుదలైన ఈ ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది. అందుకే దీనికి 'బ్రిక్' (ఇటుక) అనే పేరు కూడా వచ్చింది. ఇలాంటి ఫోన్‌ను ఎందుకు మింగాడో తెలియదు కానీ తర్వాత తన ప్రాణాలు కాపాడుకునేందుకు అతడు చాలా అవస్థ పడ్డాడు. ఫోన్‌లోని బ్యాటరీలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఈ కెమికల్స్ ప్రాణాలు పోయేలా చేయగలవు. అయితే ఫోన్ మింగేసిన తరువాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో సదరు వ్యక్తి ప్రిస్టినాలోని ఆసుపత్రిని ఆశ్రయించాడు.

Nokia 3310: తొలి ఫీచర్​ ఫోన్​కి 21 ఏళ్లు.. నోకియా 3310 జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న నెటిజన్లు

విషయం తెలుసుకున్న అక్కడి డాక్టర్ స్కెందర్.. బాధితుడి పొట్టను స్కాన్ చేశారు. అతడి కడుపులో నోకియా ఫోన్ మూడు భాగాలుగా విడిపోయి కనిపించింది. ఈ ఫోన్ భాగాలు చాలా పెద్దగా ఉండటంతో వాటిని బయటికి తీయడానికి రెండు గంటలపాటు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఆపరేషన్ సజావుగా జరగడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆపరేషన్ అనంతరం డా. స్కెందర్ తన ఫేస్ బుక్ లో ఫొటోలు షేర్ చేశారు. ఫోన్ కడుపులో ఉన్నప్పుడు తీసిన ఎక్స్-రే, ఎండోస్కోపీ చిత్రాలు నెట్టింట పంచుకున్నారు.

Intresting Crime: ఓ డొక్కు చెంచా అధికారులకు నిద్ర లేకుండా చేసింది.. ఖైదీలకు వరంగా మారింది.. వీడియో వైరల్..


అలాగే ఈ ఘటనపై ఆయన స్పందించారు. ఒక వ్యక్తి ఒక పెద్ద వస్తువు మింగినట్లు తమకు ఫోన్ కాల్ వచ్చిందని.. స్కాన్ చేసి చూస్తే అతడి కడుపులో ఫోన్ పార్ట్స్ కనిపించాయని ఆయన తెలిపారు. ఫోన్ బ్యాటరీ కడుపులోనే పేలిపోయే ప్రమాదముందని భావించి వెంటనే సర్జరీ చేసి ఫోన్ తొలగించామని  పేర్కొన్నారు.

అయితే ఫోన్ ఎందుకు మింగేశాడనే విషయాన్ని ఆ వ్యక్తి ఎవరికీ చెప్పలేదు. డా. స్కెందర్ ఆరా తీసినప్పటికీ ఆ విషయాన్ని మాత్రం వెల్లడించలేదట. ఈ ఘటనకు సంబంధించి వైరల్ అయిన వీడియో క్లిప్‌లో డాక్టర్, అతని బృందం వ్యక్తి కడుపు నుంచి ఫోన్‌ను తీసివేసినట్లు కనిపించింది. మనుషులు ఫోన్ మింగటం ఇదేం మొదటిసారి కాదు. 2016 లో 29 ఏళ్ల యువకుడు ఫోన్ మింగితే.. అతడికి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు.

First published:

Tags: Nokia, Technology, Trending news

ఉత్తమ కథలు