ఓ జవాను త్వరగా స్పందించడంతో ఓ వ్యక్తి ప్రాణాలు నిలిచాయి. అయితే ఏదో దాడి జరిగిన ఘటన కాదిది. ఢిల్లీలోని దాబ్రి మొడ్ మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడు హఠాత్తుగా కుప్పకూలారు. ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందారు. అదే సమయంలో తనిఖీ విధుల్లో ఉన్న వికాస్ అనే సీఐఎస్ఎఫ్ జవాను వేగంగా స్పందించారు. ప్రయాణికుడి వద్దకు వచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. గుండెకు ఆక్సిజన్ అందేలా ఛాతిపై నొక్కుతూ కార్డియోపల్మనరీ రెసుసియేషన్ (సీపీఆర్) చేశారు. దీంతో ఆ ప్రయాణికుడు కోలుకున్నారు. స్పృహలోకి వచ్చారు. సాధారణంగా శ్వాస తీసుకున్నారు.
కోలుకున్న ఆ ప్రయాణికుడు జవాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అతడికి వెంటనే వైద్య సాయం కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బంది అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే ఆసుపత్రికి వెళ్లేందుకు ఆయన నిరాకరించారు. జవానుతో సహా సిబ్బందికి అభినందలు తెలిపివెళ్లిపోయారు. కుప్పకూలిన వ్యక్తిని జనక్‌పూర్‌కు చెందిన సత్యనారాయణ్గా గుర్తించారు.
కాగా ఈ వీడియోను పీఐబీ బిహార్ అధికారిక ఖాతా నుంచి పోస్ట్ చేశారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ప్రయాణికుడిని చాకచక్యంతో కాపాడిన సైనికుడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Too proud too see this jawans doing respect
సైనికులకు సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందరూ సీపీఆర్ లాంటి ప్రాథమిక చికిత్స నేర్చుకోవాలని సూచించారు. జై జవాన్ అంటూ అభినందిస్తున్నారు.