ఆశ్చర్యం... అద్భుతం... గ్లాసుల్లో నీటితో విన్యాసం... సైన్స్‌ మ్యాజిక్... వైరల్ వీడియో...

ఆ వీడియో చూసిన వాళ్లు... మరోసారి చూస్తున్నారు. ఎందుకంటే... అలా ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తున్నారు. నీరు కింద పడకపోవడం వాళ్లను ఆశ్చర్యపరుస్తోంది.

news18-telugu
Updated: July 4, 2020, 12:18 PM IST
ఆశ్చర్యం... అద్భుతం... గ్లాసుల్లో నీటితో విన్యాసం... సైన్స్‌ మ్యాజిక్... వైరల్ వీడియో...
ఆశ్చర్యం... అద్భుతం... గ్లాసుల్లో నీటితో విన్యాసం... సైన్స్‌ మ్యాజిక్... వైరల్ వీడియో... (credit - twitter)
  • Share this:
మన దగ్గర టాలెంట్ ఉంటే... దాన్ని ప్రపంచానికి చూపించవచ్చు. అందుకు సోషల్ మీడియా రెడీగా ఉంది. ఎంతో మంది రోజూ తమ ట్యాలెంట్ చూపిస్తూ... అందరి ప్రశంసలూ పొందుతున్నారు. తాజాగా ఓ కుర్రాడు ఈ లిస్టులో చేరాడు. ఎందుకంటే... ఫిజిక్స్‌లో ఫార్ములాల్ని బేస్ చేసుకొని.. అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. చిన్నప్పుడు మనకు సైన్స్ ఫార్ములాలు ఆసక్తి కలిగించేవి. ఏవేవో కెమికల్స్ కలిపితే... రకరకాల రిజల్ట్స్ వచ్చేవి. ఆ థియరీలు, లాస్‌లు మనకు బాగా నచ్చేవి. ఐతే... వాటిలో కొన్నింటిని మనం నిజ జీవితంలో అన్వయించుకుంటూ ఉంటాం. ఇంటర్నెట్ పుణ్యమా అని ఇలాంటి ఎన్నో విశేషాలు మనకు తెలుస్తున్నాయి.

చెన్నైకి చెందిన ఈ కుర్రాడు మనం ఊహించనివిధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రెండు గ్లాసుల్లో నిండా నీరుపోసి... ఓ తాడుకు చెరోవైపూ ఆ గ్లాసుల్ని వేలాడదీసి... వాటిని అన్ని వైపులకూ గిర్రున తిప్పుతూ... ప్రదర్శన ఇచ్చాడు. ఐతే... ఒక్క చుక్క కూడా ఏ గ్లాసు నుంచీ కింద పడలేదు. జనరల్‌గా గ్లాస్ తిరగబడితే.. అందులో నీరు కింద పడాలి కదా... కానీ... ఇక్కడ అలా జరగకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.గ్లాస్‌లో వాటర్ ఎందుకు కింద పడలేదన్న ప్రశ్నకు ఫిజిక్స్‌లో ఆన్సర్ ఉంది. అతను అత్యంత వేగంగా ఆ గ్లాసులను తిప్పుతుండటంతో... వాటిలోని నీటిలో భూమ్యాకర్షణ శక్తి క్షణక్షణానికీ మారిపోతోంది. నీరు కిందపడేలోపే... గ్లాస్ తిరగబడుతోంది. అందువల్ల నీరు తిరిగి గ్లాస్‌లోకే వెళ్తోంది. అతను నెమ్మదిగా తిప్పి ఉంటే... కచ్చితంగా నీరు పడిపోయేదే. ఈ ఫార్ములాను అత్యంత జాగ్రత్తగా ప్రయోగించి... గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. అందుకే అందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు. నువ్వు సూపర్ బాసూ... అంటూ మంచి కామెంట్స్ పెడుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 4, 2020, 12:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading