Home /News /trending /

MAN SPENDS 45 MINS IN RESTAURANT WASHROOM WIFE LEAVES HIM BEHIND DETAILS HERE GH VB

Viral News: రెస్టారెంట్‌లో 45 నిమిషాల పాటు బాత్రూంలోనే ఉండిపోయిన భర్త.. అప్పుడు భార్య ఏం చేసిందంటే.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు అక్కడ బాత్రూంకి వెళ్తే వీలైనంత తొందరగా రావడానికి ప్రయత్నిస్తాం. మనతో పాటు వచ్చిన వాళ్లను వెయిట్ చేయించకూడదన్నది కూడా దానికి కారణం. కానీ ఓ మహిళ తన భర్త గురించి ఓ వింత నిజాన్ని రెడిట్ ద్వారా పంచుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
సాధారణంగా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు అక్కడ బాత్రూంకి వెళ్తే వీలైనంత తొందరగా రావడానికి ప్రయత్నిస్తాం. మనతో పాటు వచ్చిన వాళ్లను వెయిట్ చేయించకూడదన్నది కూడా దానికి కారణం. కానీ ఓ మహిళ తన భర్త గురించి ఓ వింత నిజాన్ని రెడిట్ ద్వారా పంచుకుంది. తన భర్త సాధారణంగా రోజులో నాలుగైదు గంటల పాటు బాత్రూంలోనే గడుపుతాడని.. రోజుకు నాలుగైదు సార్లు మూత్ర విసర్జనకు వెళ్లి కనీసం 45 నిమిషాల పాటు అక్కడే ఉంటాడని చెప్పిందామె. అంతే కాదు.. ఓసారి రెస్టారెంట్లో జరిగిన సంఘటనను కూడా అందరితో పంచుకుంది. ఈ వైరల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. ‘మా ఆయన జస్టిన్ కి రోజూ బాత్రూంలో గంటలుగంటలు గడపడం అలవాటు. మేం కలిసి ఉండడం ప్రారంభించిన రోజు నుంచి ఇది గమనించాను. ఇది నాకు చాలా చిరాకు పెట్టేది. ఓసారి రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు ఫుడ్ వచ్చేలోగా బాత్రూంకు వెళ్లి.. 45 నిమిషాల వరకు రాలేదు. మా టేబుల్ పై ఫుడ్ ఉంది కానీ దాన్ని తినకుండా అంత సేపు తనకోసం వేచి చూడాల్సి వచ్చింది. అక్కడికి బాత్రూంకి వెళ్లే ముందే తనకి నేను గుర్తు చేశాను. ఇది రెస్టారెంట్.. ఇంట్లో మాదిరిగా ఎక్కువ సేపు ఇక్కడ బాత్రూంలో గడపడం సరికాదని కూడా చెప్పాను.

అయితే ఫుడ్ వచ్చి అరగంట అయినా తను రాకపోవడంతో బాత్రూం దగ్గరకి వెళ్లాను. తనని పిలిచాను. దీంతో రెండు నిమిషాల్లో బయటకు వస్తానని చెప్పిన వ్యక్తి మరో పది నిమిషాలైనా రాలేదు’ అని సదరు మహిళ వివరించింది.  ఎన్ని సార్లు ఫోన్లు చేసినా, మెసేజెస్ పెట్టినా వాటికి అస్సలు రిప్లై ఇవ్వలేదని. దీంతో టేబుల్‌పై ఉన్న ఫుడ్‌లో సగం తినేసి బిల్ స్ప్లిట్ చేయాలని సిబ్బందికి చెప్పిందట. వారికి టిప్ ఇచ్చి ట్యాక్సీలో ఇంటికి వెళ్లిందట. అనంతరం 20 నిమిషాల తర్వాత తన భర్త టేబుల్ దగ్గరికి వచ్చి.. ఆమె అక్కడ లేకపోవడం గమనించి కాల్ చేశాడట. అలా మధ్యలోనే ఇంటికి వచ్చినందుకు కోప్పడ్డాడని తెలిపింది.

అయితే ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ కాకపోవడంతో అలా వచ్చేశానని ఆమె చెప్పిందట.  ఈ కథను చదివిన చాలామంది రెడిట్ యూజర్లు అవాక్కవుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేసేవాళ్లమని కొందరు చెబుతుంటే.. మరికొందరు ఈ ఫన్నీ స్టోరీపై వివిధ రియాక్షన్లు అందిస్తున్నారు. ‘మీరు ఇలా టేబుల్ మీద ఫుడ్ చల్లారిపోతుంటే ఎవరికోసమైనా కొన్ని గంటల పాటు వేచి చూశారా? అయితే మీ స్టోరీని కూడా పంచుకోండి’ అంటూ రెడిట్‌లో కామెంట్లు పెడుతున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Bar and restaurants, VIRAL NEWS, Wife

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు