హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: పార్సిల్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన కొరియర్ బాయ్.. ప్రూఫ్‌ కోసం తీసిన ఫోటోలో ఏముందంటే..

Viral Video: పార్సిల్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన కొరియర్ బాయ్.. ప్రూఫ్‌ కోసం తీసిన ఫోటోలో ఏముందంటే..

(Image- Youtube)

(Image- Youtube)

కొరియర్‌ బాయ్ మీ ఇంటికి ఏదైనా పార్సిల్‌ ఇవ్వడానికి వచ్చినప్పుడు.. డెలివరీ ఇచ్చే ముందు ఓ ఫొటో తీసుకుంటాడు. ఇలా ఓ డెలివరీ బాయ్ ఫొటో తీసుకునే క్రమంలో ఏం జరిగిందనే వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కొరియర్‌ బాయ్ మీ ఇంటికి ఏదైనా పార్సిల్‌ ఇవ్వడానికి వచ్చినప్పుడు.. డెలివరీ ఇచ్చే ముందు ఓ ఫొటో తీసుకుంటాడు. ఆ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఆ ఫొటోను వాళ్లు ప్రూఫ్‌గా వాడుకుంటారు. అయితే ప్రూఫ్‌ కోసం ఫొటోలో ఏం క్లిక్‌ అవుతుందో కూడా చూడలేదు ఓ ఘనుడు. ఇలా ఫొటో తీసుకునే క్రమంలో ఏం జరిగిందనే వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏమైందంటే...

టిక్‌టాక్‌ యూజర్‌ అయిన జాక్స్‌రాక్స్‌ అనే యువతికి ఇటీవల ఓ పార్సిల్‌ వచ్చింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో.. రోడ్డు మీద నీళ్లు నిలిచిపోయాయి. అయితే ఆ పార్సిల్‌ అందుకోవడానికి ఆమె డెలివరీ బాయ్‌ దగ్గరకు వస్తుండగా పొరపాటున జారిపడింది. ఈలోగా కొరియర్ బాయ్... ఆ పార్సిల్‌ను ఫొటో తీసుకున్నాడు. ఈ రెండూ ఒకేసమయంలో జరిగాయి. ఇక్కడిదాకా బాగుంది. అయితే ఆ పార్సిల్‌ ఫొటోలో కింద పడిపోయిన జాక్స్‌రాక్స్‌ కూడా పడింది.

ఈ మొత్తం సీన్‌ దగ్గర్లోని కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ తర్వాత జాక్స్‌రాక్స్‌ ఆ వీడియోను టిక్‌టాక్‌లో షేర్‌ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోతోపాటు పార్సిల్‌ ఫొటోను కూడా టిక్‌టాకర్‌ షేర్‌ చేసింది. ఇదంతా గత నెల 21న జరిగిందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను పది లక్షల మందికిపైగా వీక్షించారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఓవైపు కొంతమంది కొరియర్‌ బాయ్‌ను సపోర్టు చేస్తుంటే, ఇంకొంతమంది జారిపడిన యువతికి సపోర్టు చేస్తున్నారు.

కొరియర్‌ బాయ్ తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. ఫొటో తీస్తున్నప్పుడు ఆమె పడిపోయిన విషయం చూడలేదేమో అని కొందరు కామెంట్లు చేస్తుంటే, ఇంకొందరేమో... మహిళ కిందపడిపోతే కనీసం చూడడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ టిక్‌టాకర్‌కి అక్కడి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ బాగా ఉపయోగపడింది... టిక్‌టాక్‌లో లైక్‌లే లైక్‌లు’ అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమందేమో... డెలివరీ షెడ్యూల్‌ బిజీగా ఉండటం వల్లే అలా చేశాడు అని అంటున్నారు.

' isDesktop="true" id="928350" youtubeid="M8lq5KtU1p8" category="trending">

మన దగ్గర కూడా ఇలా ఎమోషన్లు, పరిస్థితులు చూడకుండా పనులు చేసేవాళ్లుంటారు. అంతెందుకు మీకు కూడా ఇలాంటి వ్యక్తులు తగిలే ఉంటారు. ఇంకొంతమంది విషయంలో ఏదో అనుకోకుండా జరిగి ఉంటుంది. మరి ఈ విషయంలో ఎలా జరిగిందో తెలియదు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం... తప్పకుండా నవ్వొస్తుంది. కొరియర్‌ ప్రూఫ్‌ కోసం తీసుకున్న ఇమేజ్‌ చూస్తే ఇంకా నవ్వొస్తుంది.

First published:

Tags: Home delivery, Viral Video

ఉత్తమ కథలు