98 పెన్సిళ్లతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

డేవిడ్ రష్... అనే వ్యక్తి పెన్సిల్ బ్రేకింగ్ పై ఇప్పటివరకు ఉన్న రికార్డును కొల్లగొట్టాడు. కేవలం ఒక నిమిషంలో 98 పెన్సిల్స్‌ను విరగ్గొట్టాడు.

news18-telugu
Updated: September 12, 2019, 10:45 AM IST
98 పెన్సిళ్లతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
98 పెన్సిల్స్‌తో గిన్నీస్ రికార్డ్
news18-telugu
Updated: September 12, 2019, 10:45 AM IST
గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకునేందు చాలామంది చాలా రకాల ఫీట్లు చేస్తుంటారు. కొత్త కొత్త విన్యాసాలు... సరికొత్త ప్రయోగాలు చేస్తూ... గిన్నీస్ రికార్డ్ కోసం శ్రమిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి పెన్సిళ్లతో గిన్నీస్ రికార్డ్ కొల్లగొట్టాడు. డేవిడ్ రష్... అనే వ్యక్తి పెన్సిల్ బ్రేకింగ్ పై ఇప్పటివరకు ఉన్న రికార్డును కొల్లగొట్టాడు. కేవలం ఒక నిమిషంలో 98 పెన్సిల్స్‌ను విరగ్గొట్టాడు. ఇప్పటివరకు ఈ పెన్సిల్ బ్రేకింగ్ ఉన్న రికార్డ్‌ను డేవిడ్ బీట్ చేశాడు. ఇప్పటికే తన పేరు వందకు పైగా గిన్నీస్ రికార్డులు కూడా సాధించాడు. తాజాగా ఇడాహో అవుట్ ఆఫ్ స్కూల్ నెట్‌వర్క్ సమావేశంలో మెరిసిన రష్... సరికొత్తగా పెన్సిల్ బ్రేకింగ్ రికార్డ్ నెలకొల్పాడు. వెదురుకర్రలపై రికార్డ్ సృష్టించేందుకు తాను ప్రాక్టీస్ చేశానని.. అందుకే తాజా రికార్డ్ కోసం పెన్సిళ్లను కొని వాటిని విరగ్గొట్టి వేస్ట్ చేయాల్సిన అసవరం రాలేదని తెలిపాడు డేవిడ్.First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...