హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

జొమాటో డెలివరీ బాయ్ పై యువతి పైశాచికం.. చెప్పుతో ఇష్టమోచ్చినట్లు కొడుతూ.. వీడియో వైరల్..

జొమాటో డెలివరీ బాయ్ పై యువతి పైశాచికం.. చెప్పుతో ఇష్టమోచ్చినట్లు కొడుతూ.. వీడియో వైరల్..

జొమాటో డెలివరీ బాయ్ ను కొడుతున్న యువతి

జొమాటో డెలివరీ బాయ్ ను కొడుతున్న యువతి

Viral video:  యువతి అమానవీయంగా ప్రవర్తించింది. జొమాటో డెలివరీ బాయ్ ను నోటికొచ్చినట్లు తిట్టింది. అంతే కాకుండా.. అతడిని చెప్పుతో కూడా కొట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

కొంత మంది అమ్మాయిలు రోడ్ల మీద నీచంగా ప్రవర్తిస్తుంటారు. తాగి రోడ్ల మీద న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. రోడ్డు మీద వస్తూ పోతున్న వారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. కొంత మంది తాగి రోడ్ల మీద ఇష్టమోచ్చినట్లు నానా హంగామా చేస్తుంటారు. కొంత మంది బాయ్ ఫ్రెండ్ కోసం గొడవ పడుతుంటారు. మరికొందరు.. తాగిన మైకంలో ఒకరిపై మరోకరు దాడులు చేసుకుంటుంటారు. ఇప్పటికే అమ్మాయిల న్యూసెన్స్ లకు సంబంధించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, మరోక ఘటన సోషల్ మీడియాలో (Social media) లో వైరల్ గా (Viral video)  మారింది.


పూర్తి వివరాలు.. ఒక యువతి జొమాటో డెలివరీ (Zomato) బాయ్ నుంచి డెలివరీ లాక్కుంది. అంతే కాకుండా.. అతగాడిని నోటికొచ్చినట్లు తిడుతూ.. చెప్పుతో కొట్టింది. అతను వద్దని చెప్పిన అసలు పట్టించుకోవట్లేదు. చుట్టుపక్కల వారు.. వారిస్తున్న ఏమాత్రం లెక్కచేయడం లేదు. దీంతో కొంత మంది ఈ ఘటనను తమ సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. అంతేకాకుండా.. జొమాటో అఫిషియల్ ట్విటర్ కు ట్విట్ చేశారు. ఇది వెంటనే వైరల్ గా మారిపోయింది. మహిళ తన డెలివరీకాకున్న బలవంతంగా లాక్కుని మరీ అతనిపై దాడికి తెగబడినట్లు సమాచారం.
అయితే.. దీనికి అనేక మంది డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడిన యువతికి వ్యతిరేకంగా ట్విట్ లు చేశారు. దీనికి కంపెనీ రిప్లై ఇచ్చింది. వెంటనే తాము లోకల్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి సమస్య ఏంతో తెలుసుకుంటామని రిప్లై ఇచ్చింది. అయితే.. ఆర్డర్ ఇచ్చినవ్యక్తి దగ్గరకు వచ్చి జొమాటో బాయ్ తన ఉద్యోగం పోతుందని ఏడ్చాడు. అసలు.. అది అమ్మాయిల ఆర్డర్ కాకున్న బలవంతంగా డెలివరీ లాక్కుని, జొమాటో బాయ్ పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వెంటనే అతడికి న్యాయం చేయాలంటూ ట్విట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (social media)  వైరల్ గా (Viral video)  మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Food delivery, Trending video, Viral Video, Zomato

ఉత్తమ కథలు