• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • MAN SAID BREAKUP FOR HIS GIRLFRIEND AFTER HE KNOW SHE SECRETLY GOING TO MCDONALD TO EAT CHICKEN NUGGETS HSN GH

ప్రియుడు శాకాహారి.. ప్రేయసి ఫుల్లు మాంసాహారి.. ఏడాదిగా సహజీవనం.. నాన్ వెజ్ తినాలన్న ఆశతో ఆమె చేసిన ఒకే ఒక్క తప్పుతో..

ప్రియుడు శాకాహారి.. ప్రేయసి ఫుల్లు మాంసాహారి.. ఏడాదిగా సహజీవనం.. నాన్ వెజ్ తినాలన్న ఆశతో ఆమె చేసిన ఒకే ఒక్క తప్పుతో..

ప్రతీకాత్మక చిత్రం

మాంసాహారం తినాలనే ఆశ.. ఒక యువతికి తన ప్రేమికుడిని దూరం చేసిన ఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. శాకాహారి అయిన తన ప్రియుడికి తెలియకుండా మెక్‌ డొనాల్డ్స్‌కు వెళ్లి చికెన్ నగ్గెట్స్ తినడమే ఆమె చేసిన తప్పు.

  • Share this:
మాంసాహారం తినాలనే ఆశ.. ఒక యువతికి తన ప్రేమికుడిని దూరం చేసిన ఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. శాకాహారి అయిన తన ప్రియుడికి తెలియకుండా మెక్‌ డొనాల్డ్స్‌కు వెళ్లి చికెన్ నగ్గెట్స్ తినడమే ఆమె చేసిన తప్పు. కానీ ప్రియుడు మాత్రం.. ఆమె తనను మోసం చేస్తుందని భావించాడు. రిలేషన్‌షిప్ వద్దని బ్రేకప్ చెప్పాడు. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 22 ఏళ్ల ఒక యువతి చిన్నప్పటి నుంచి మాంసాహారాన్ని బాగా ఇష్టపడేది. గత మూడేళ్లుగా ఆమె ఒక వ్యక్తిని ప్రేమిస్తోంది. కానీ 24 ఏళ్ల తన బాయ్‌ఫ్రెండ్ మాత్రం పూర్తి శాకాహారుడు. అతడు వీగన్ డైట్‌ను ఫాలో అవుతాడు. ఒక సంవత్సరం నుంచి ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఇద్దరూ వీగన్‌ డైట్‌నే అనుసరించేవారు.

కానీ ఆ యువతికి మాత్రం నాన్‌వెజ్ తినాలనే ఆశ ఉండేది. బాయ్‌ఫ్రెండ్‌ ఇందుకు ఒప్పుకోడని ఆమెకు తెలుసు. అందుకే ఈ విషయం గురించి ఆలోచించడం మానేసింది. కానీ కొన్నాళ్ల తరువాత కలలో కూడా చికెన్ నగ్గెట్స్, ఇతర నాన్‌వెజ్ ఆహారం కనిపించడం ప్రారంభించిందట. దీంతో తన ప్రియుడికి తెలియకుండా దొంగచాటుగా మెక్ డొనాల్డ్స్‌కు వెళ్లడం అలవాటు చేసుకుంది. వారంలో కనీసం రెండుసార్లు మెక్‌ డొనాల్డ్స్‌కు వెళ్లి చికెన్ నగ్గెట్స్ తినేది. ఇంట్లో మాత్రం సూపర్ మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పేది. ఇలా బయటకు వెళ్లేటప్పుడు తోడుగా వస్తానని బాయ్‌ఫ్రెండ్ అడిగితే.. వద్దని వారించేది. గొత కొన్నాళ్లుగా ఇలా తరచూ జరగడంతో ఆ ప్రియుడికి అనుమానం వచ్చింది.
ఇది కూడా చదవండి: ప్లీజ్.. నన్ను రెండో పెళ్లయినా చేసుకోమని కోరిన యువతి.. నో చెప్పిన ప్రియుడు.. ఆ భగ్న ప్రేమికురాలు ఎంతకు తెగించిందంటే..

ఆమె తనను మోసం చేస్తూ, వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని, అందుకే తనకు తెలియకుండా ప్రతిసారీ బయటకు వెళ్తుందని అనుమానించాడు. ఈ విషయంపై ఇటీవల ఇద్దరికీ గొడవ జరిగింది. దీంతో చికెన్ తినేందుకు మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్తున్నానని ఆమె నిజం చెప్పేసింది. కానీ అసలు విషయం చెప్పినా.. తన బాయ్‌ఫ్రెండ్ మాత్రం ఆమెను నమ్మలేదు. మెక్‌ డొనాల్డ్స్ అంటూ నాటకమాడుతున్నావని అతడు ఆరోపించాడు. వేరొకరితో సన్నిహితంగా ఉంటూ తనను మోసం చేస్తోందనే బలంగా నమ్మాడు. తనతో కలిసి జీవితాన్ని పంచుకోవడం కష్టమని.. ఆమెకు బ్రేకప్ చెప్పాడు. దీంతో వీరి మూడేళ్ల రిలేషన్‌షిప్‌కు బ్రేకులు పడ్డాయి.
ఇది కూడా చదవండి: పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. అసలు కారణం ఏంటని నేరుగా అతడికే వధువు ఫోన్ చేస్తే..

చికెన్‌పై ఉన్న ఇష్టమే యువతికి తన ప్రేమికుడిని దూరం చేసింది. ఈ వివరాలను ఆమె రెడిట్‌లో రిలేషన్ టిప్స్ చెప్పే ఒక పేజీలో పోస్ట్ చేసింది. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ విషయాన్ని బాయ్‌ఫ్రెండ్‌కు ఎలా చెప్పాలో సూచించమని యూజర్లను కోరింది. ఇలాంటి చెత్త కారణంతో మూడేళ్ల రిలేషన్‌షిప్ అంతమవుతుందని ఊహించలేదని బాధితురాలు వాపోయింది. ఈ పోస్టుకు వేల సంఖ్యలో అప్ ఓట్స్ ( లైక్స్ వంటివి), కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటి నుంచి దొంగచాటుగా కాకుండా.. ధైర్యంగా మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లి చికెన్ తినమని ఒక వ్యక్తి ఆమెకు సూచించాడు. మెక్‌ డొనాల్డ్స్ సిబ్బంది సాయంతో ప్రేమికుడికి అసలు విషయం అర్థమయ్యేలా చెప్పండని మరో వ్యక్తి సూచించారు. ఈ పోస్టుకు వందల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. యూజర్లు యువతికి తమకు తోచిన సూచనలు ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..
First published: