HOME »NEWS »TRENDING »man rescues deer stuck on frozen lake by pushing it goes viral on twitter srd

Trending : గడ్డకట్టిన నదిపై చిక్కుకున్న జింకను ఎలా కాపాడాడో చూడండి.. వీడియో వైరల్

Trending : గడ్డకట్టిన నదిపై చిక్కుకున్న జింకను ఎలా కాపాడాడో చూడండి.. వీడియో వైరల్
man resuces deer (Photo: Twitter)

Trending : ఓ జింక గడ్డకట్టిన నదిపై చిక్కుకుంది. ఆ గడ్డకట్టిన నదిపై ఎలా నడవాలో దానికి తెలియలేదు. ముందుకు అడుగు వేద్దామంటే జారి పడిపోతోంది. ఏం చేయాలో పాలుపోక అలాగే ఆ గడ్డకట్టిన నదిపైనే కూర్చుండిపోయింది. ఎవరైనా సాయం చేయకపోతారా అన్న భావన దాని మనస్సులో ఉంది. ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి ఆ మూగప్రాణి బాధను చూశాడు.

  • Share this:
    ఓ జింక గడ్డకట్టిన నదిపై చిక్కుకుంది. ఆ గడ్డకట్టిన నదిపై ఎలా నడవాలో దానికి తెలియలేదు. ముందుకు అడుగు వేద్దామంటే జారి పడిపోతోంది. ఏం చేయాలో పాలుపోక అలాగే ఆ గడ్డకట్టిన నదిపైనే కూర్చుండిపోయింది. ఎవరైనా సాయం చేయకపోతారా అన్న భావన దాని మనస్సులో ఉంది. ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి ఆ మూగప్రాణి బాధను చూశాడు. తనలో దాగి ఉన్న మానవత్వాన్ని తట్టి లేపాడు. ఆ మూగప్రాణికి సాయం చేసి.. ఆ గడ్డకట్టిన నది నుంచి దాన్ని దాటించాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది.డ్యానీ డేరనీ అనే వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దానికి సాయం చేసిన వ్యక్తిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

    ఆ వ్యక్తి జింకను కాపాడగానే అది అక్కడి నుంచి పారిపోయింది. ఆ జింకను కాపాడిన వ్యక్తి గిల్ లెన్సార్. " ఆ మూగప్రాణి ఆ పరిస్థితుల్లో ఉండటం చూసి చలించిపోయాను. దానికి సాయం కావాలని అర్థం చేసుకున్నాను. వెంటనే ఎటువంటి ఆలోచన చేయకుండా దాన్ని దగ్గరికి వెళ్లాను. నా రెండు చేతులతో దాన్ని ఐస్ మీద నుంచి తోసుకుంటూ వెళ్లాను. గట్టుకు చేరుకున్న వెంటనే అది వెళ్లిపోవడం చూసి నేను సంతోషించాను " అని గిల్ లెన్సార్ తెలిపాడు.












    ఈ వీడియో ట్విట్టర్ లో షేర్ చేయగానే.. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు ఆరు లక్షల మంది చూడగా 60 వేల లైక్స్ వచ్చాయ్. నెటిజన్లు ఆ జింకకు సాయం చేసిన గిల్ లెన్సార్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:December 25, 2020, 17:40 IST