హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: ఢిల్లీ పార్కులో వీధి కుక్కపై వ్యక్తి అత్యాచారం..వైరల్ అవుతున్న వీడియో

OMG: ఢిల్లీ పార్కులో వీధి కుక్కపై వ్యక్తి అత్యాచారం..వైరల్ అవుతున్న వీడియో

delhi dog rapist(Photo:Twitter)

delhi dog rapist(Photo:Twitter)

OMG: దేశ రాజధాని ఢిల్లీలో మనిషి ముసుగులో ఉన్న ఓ కామాంధుడు పశువులా ప్రవర్తించాడు. సభ్య సమాజం తల దించుకునే విధంగా ప్రవర్తించాడు. పబ్లిక్ పార్కులో ఓ వీధి కుక్కపై అత్యాచారం చేసిన ఘటన యావత్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మనిషి ముసుగులో ఉన్న ఓ కామాంధుడు పశువులా ప్రవర్తించాడు. సభ్య సమాజం తల దించుకునే విధంగా ప్రవర్తించాడు. పబ్లిక్ పార్కులో ఓ వీధి కుక్క(Stray Dog)పై అత్యాచారం చేసిన ఘటన యావత్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నోరు లేని మూగజీవాల పట్ల ఇంతటి దుర్మార్గపు చర్యకు పాల్పడిన వాడ్ని వదిలిపెట్టవద్దని జంతు ప్రేమికులతో పాటు సాధారణ ప్రజలు, డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్‌ కావడంతో శునకంపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నించి వదిలేయడం ఏమిటని నిలదీస్తున్నారు. పోలీసుల(Police) చర్యను తప్పు పడుతున్నారు.

మనిషి కాదు పశువు..

ఢిల్లీలో మరో నీచమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హరినగర్‌ ప్రాంతంలోని ఓ పార్కులో వీధి కుక్కపై అత్యాచారం చేస్తూ కెమెరాకు చిక్కాడో వ్యక్తి. వీధి కుక్కపై కామవాంఛ తీర్చుకుంటున్న మనిషి రూపంలో ఉన్న పశువును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వార్త దావానంలా వ్యాపించింది. ఓ వ్యక్తి మూగజీవిపై లైంగిక దాడి చేయడాన్ని జంతు హింసతో సమానంగా చూస్తున్నారు. అలాంటి అసహ్యకరమైన చర్యకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌లు, ఫోటోలు షేర్ చేస్తున్నారు.

వీధి కుక్కపై అత్యాచారం..

ఈ వీడియోను చూపించి మానవమృగంపై కేసు పెట్టమంటూ జంతు ప్రేమికులు, పోలీసులకు చూపించడంతో సీరియస్‌గా తీసుకోకపోవడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాట్సాప్‌ చాటింగ్‌, స్క్రీన్‌ షాట్‌ ఫోటోల ఆధారంగా కుక్కపై అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించలేమని ..విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

పార్కులో పాడు పని..

ట్విట్టర్‌లో ఈవిషయంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులపై నెటిజన్లు దుర్భాషలాడుతున్నారు. సిగ్గుమాలిన పని చేసిన అలాంటి వ్యక్తులను వదిలేస్తే ఎలా ఉంటూ ప్రశ్నిస్తున్నారు. పోలీసుల్ని నిందిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు..

మరోవైపు ఏఐసీసీ సభ్యుడు పంఖూరి పాఠక్ కూడా ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు.ఢిల్లీ పోలీసులను, మరికొందరు అధికారులను ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేస్తూ, “మనం స్పష్టంగా చెప్పండి. FIR నమోదు చేయకుండా ఈ రాక్షసుడిని అరెస్టు చేయకుండా, @DelhiPolice ఒక రేపిస్ట్‌కు రక్షణ కల్పిస్తున్నారంటూ విమర్శించారు.

First published:

Tags: Delhi news, National News, Stray dogs

ఉత్తమ కథలు