2 గంటలు కదలకుండా ఉండి వీడియో రికార్డ్... వైరల్ అయిన యూట్యూబర్

కరోనా టైమ్. వీడియోలు చెయ్యడం యూట్యూబర్లకు ఓ సవాలైంది. దాంతో చాలా మంది కొత్తగా ఆలోచిస్తూ... షాకింగ్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: August 1, 2020, 11:34 AM IST
2 గంటలు కదలకుండా ఉండి వీడియో రికార్డ్...  వైరల్ అయిన యూట్యూబర్
2 గంటలు కదలకుండా ఉండి వీడియో రికార్డ్... వైరల్ అయిన యూట్యూబర్ (credit - youtube)
  • Share this:
జనరల్‌గా మనం ఓ యూట్యూబ్ వీడియో చెయ్యాలంటే... ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తాం. ఆ యూట్యూబర్ కూడా ఇలాగే ఆలోచించి... చివరకు ఏమీ చెయ్యకుండా... ఓ చోట కదలకుండా కూర్చున్నాడు. 2 గంటలపాటూ అలాగే కూర్చొని కెమెరావైపే చూశాడు. దాన్నే వీడియోగా అప్‌లోడ్ చేశాడు. దానికి టైటిల్ 2 JAM nggak ngapa ngapain అని పెట్టాడు. దానర్థం 2 గంటల పాటూ కదల్లేదు అని. ఇండోనేసియా యూట్యూబర్ మహమ్మద్ దిదిత్ ఆలోచన ఇది. చాలా మంది అతన్ని యూత్‌ని ఎడ్యుకేట్ చేసే వీడియోలు అప్‌లోడ్ చెయ్యమని కోరారట. దాంతో ఈ వీడియో పెట్టానని చెబుతున్నాడు.

యూత్ ఎడ్యుకేషన్‌కీ ఈ వీడియోకీ ఏమైనా సంబంధం ఉందా అంటే ఒక్క శాతం కూడా లేదు. కానీ... దిదిత్ ఏమంటున్నాడంటే... ఇప్పుడు తన వీడియో వైరల్ అవుతోందనీ... యూత్‌కి తాను ఇచ్చే సందేశం ఇదే అంటున్నాడు. సందేశం సంగతేమోగానీ... ఇలా కొత్తగా ఆలోచించి వీడియో పెట్టడం వల్ల ఇది వైరల్ అయ్యింది. జులై 10న దీన్ని అప్‌లోడ్ చెయ్యగా ఇప్పటికే 19 లక్షల మందికి పైగా దీన్ని చూశారు. ఏమీ చెయ్యకుండానే ఈ వీడియో దవారా... దిదిత్ దాదాపు రూ.70వేల దాకా రెవెన్యూ పొందినట్లైంది. యూత్ కొత్తగా ఆలోచించాలన్నదే ఇందులో సందేశం కావచ్చంటున్నారు.


ఈ వీడియోలో అతను ధ్యానం చేస్తున్నాడని కొందరు అంటుంటే... అసలీ ఆలోచన ఎలా వచ్చిందని మరికొందరు అంటున్నారు. ఏమీ చెయ్యని అతని గురించి... 15 లక్షల మంది తెలుసుకున్నారు అని ఇంకో యూజర్ అనగా... అతను కళ్లు కదుపుతున్నాడని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. ఆ 2 గంటలూ అతను ఏమి ఆలోచించాడో అని ఇంకొకరు, కెమెరా రికార్డ్ బటన్ ఆన్ చెయ్యకుండా ఇదంతా చేసి ఉంటే ఏమయ్యేదో అని మరో యూజర్ కామెంట్ చేశారు. అతను మొత్తం 362 సార్లు కనురెప్పలు ఆర్పాడని ఓ యూజర్ తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: August 1, 2020, 11:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading