Opertaion In Italy : ఇటలీ(Italy) రాజధాని రోమ్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యులు చాలా ఆశ్చర్యకరమైన సర్జరీని విజయవంతంగా చేశారు. నిజానికి ఇక్కడ ఒక సంగీతకారుడికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. దీంతో అతను చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. విశేషమేమిటంటే, ఈ శస్త్రచికిత్స సమయంలో రోగి 9 గంటల పాటు మెలకువగా ఉండి కంటిన్యూగా శాక్సోఫోన్ వాయిస్తూనే ఉన్నాడు. 1970 చిత్రం "లవ్ స్టోరీ" లోని థీమ్ సాంగ్, ఇటాలియన్ జాతీయ గీతాన్ని ఆపరేషన్ జరుగుతున్నంతసేపు పేషెంట్ చాలాసార్లు ప్లే చేశాడు. ఆ సమయంలో డాక్టర్లు అతని తలలోని కణితిని తొలగించి ఈ సర్జరీ విజయవంతం చేశారు. కాసేపటికే పేషెంట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. కణితిని విజయవంతంగా తొలగించామని, రోగిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని న్యూరోసర్జన్, అవేక్ సర్జరీలో నిపుణుడు డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా చెప్పారు. ఇలాంటి సర్జరీకి సంగీతం సహకరించినట్లు చెప్పారు. ఈ శస్త్రచికిత్స కోసం బ్రోగ్నా 10 మంది సభ్యుల ఇంటర్నేషనల్ టీమ్ కు నాయకత్వం వహించారు.
చాలా క్లిష్టంగా ఆపరేషన్
కణితి మెదడులోని చాలా క్లిష్టమైన ప్రాంతంలో ఉందని డాక్టర్ చెప్పారు. రోగి ఎడమచేతి వాటం కలిగిన వాడని తెలిపారు. మెదడు యొక్క నాడీ మార్గాలు చాలా క్లిష్టంగా ఉన్నందున ఇది ఇష్యూస్ ని మరింత క్లిష్టతరం చేసినట్లు తెలిపారు.
Shani Graha: జాతకంలో శని స్థానం..మీ భవిష్యత్తు ఎలా ఉంటదో తెలుసుకోండి!
రోగి మెలకువగా ఉండటం అవసరం
డాక్టర్ల అభిప్రాయం ప్రకారం ఆపరేషన్ సమయంలో అతను మెలకువగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే దీనివల్ల ఆపరేషన్ సమయంలో డాక్టర్లు పేషఎంట్ మెదడు యొక్క వివిధ విధులను చూసే అవకాశం పొందుతారు. రోగి తాను సంగీత విద్వాంసుడని ముందే చెప్పాడు. అప్పుడు వైద్యులు శాక్సోఫోన్ వాయించమని అడిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Italy