MAN PAY RS 126 CRORE TO GET SPECIAL LICENSE PLATE AS A HOMAGE TO HIS GRANDFATHER HERES WHY MK GH
వేలంలో రూ. 1.28 కోట్లకు Fancy Number దక్కించుకున్న వ్యక్తి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ప్రతీకాత్మకచిత్రం
ఫ్యాన్సీ నంబర్ సొంతం చేసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఫ్యాన్సీ నెంబర్‌కు పెట్టాల్సిన ఖర్చు మనం కొనుగోలు చేసిన వాహనం కంటే ఎక్కువగా ఉంటుంది. సంపన్నులకు మాత్రమే ఇలాంటి నెంబర్ ప్లేట్లు దక్కించుకోవడానికి వీలవుతుంది.
ఈ రోజుల్లో చాలా మంది విలాసవంతమైన లగ్జరీ కారు కలిగి ఉండటమే కాదు.. ఫ్యాన్సీ నంబర్‌ను కలిగి ఉండటం కూడా ఈ మధ్యకాలంలో స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. కానీ, ఇది అందరికీ సాధ్య పడదు. ఎందుకంటే ఫ్యాన్సీ నంబర్ సొంతం చేసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఫ్యాన్సీ నెంబర్‌కు పెట్టాల్సిన ఖర్చు మనం కొనుగోలు చేసిన వాహనం కంటే ఎక్కువగా ఉంటుంది. సంపన్నులకు మాత్రమే ఇలాంటి నెంబర్ ప్లేట్లు దక్కించుకోవడానికి వీలవుతుంది. అయితే, ‘O 10’ అనే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కోసం ఇంత భారీ మొత్తంలో వెచ్చించడానికి కారణం మాత్రం అందరి హృదయాలను కరిగించింది. అతను ‘O 10’ ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కించుకోవడానికి గల కారణాలను ప్రముఖ ఆటోమొబైల్ ప్లాట్ ఫార్మ్ మోటారు 1.కామ్ పేర్కొంది. దాని ప్రకారం నంబర్ ప్లేట్ పొందిన వ్యక్తి ఆ సంఖ్య వెనుక ఉన్న అసలు కథను వెల్లడించాడు. 1902లో బర్మింగ్‌హామ్‌లో మొదటిసారి నంబర్ ప్లేట్సిరీస్ను ప్రారంభించినప్పుడు నంబర్ ప్లేట్ దక్కించుకున్న వారిలో తన తాత పదవ వ్యక్తి అని, అందువల్ల మా తాతకు గుర్తుగా ‘O 10’ నంబర్‌ను దక్కించుకున్నానని ఆయన అన్నారు. కాగా, 1874లో జన్మించిన అతని తాత పేరు చార్లెస్ థాంప్సన్. ఆయన ఒక హోల్‌సేల్ కంపెనీని యజమాని. ఆయన ఎక్కువగా బర్మింగ్‌హామ్ ప్రాంతానికి స్టేషనరీని రవాణా చేసి దాన్ని విక్రయించేవాడు.
‘0 10’ సెంటిమెంట్ నంబర్..
1955లో చార్లెస్ కన్నుమూసిన తరువాత, అతని కొడుకు బారీ థాంప్సన్ ఆ కారు యజమాని అయ్యాడు. ఆయనకు కూడా ఫ్యాన్సీ నంబర్లపై మోజు ఎక్కువ. అయితే, బారీ థాంప్సన్ కలపను రవాణా చేసి విక్రయించేవాడు. ఇందుకు గాను ‘0 10’ నంబర్ ప్లేట్‌ను సెంటిమెంట్‌గా భావించేవాడు. దీనిలో భాగంగా, ఆయన ఆస్టిన్ A35, మినీ, ఫోర్డ్ కార్టినా, జాగ్వార్ వంటి కార్లకు పలు నంబర్ ప్లేట్లను ఉపయోగించారు. దురదృష్టవశాత్తు, బారీ థాంప్సన్ 2017లో చనిపోయాడు. ఆ తరువాత, లోకల్ డ్రైవర్స్ అండ్ వెహికల్ లైసెన్సింగ్ ఏజెన్సీ (డివిఎల్ఎ) థాంప్సన్‌కు చెందిన అన్ని వాహనాల ధృవీకరణను నిలిపివేసింది. అయితే, అప్పటి నుండి 2020 నవంబర్ 13 వరకు ఆయా నంబర్ ప్లేట్లను ఎవరూ ఉపయోగించలేదు. అయితే, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను సిల్వర్‌స్టోన్ కంపెనీ ఇటీవల వేలం వేయగా దీన్ని 1.28 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైంది. కాగా, ఈ వేలానికి సంబంధిన విషయాలను సిల్వర్‌స్టోన్ తన ఫేస్బుక్ పేజీలో పంచుకుంది. అయితే, వేలంలో నంబర్ ప్లేట్‌ను దక్కించున్న వ్యక్తి పేరును మాత్రం ఆ పోస్ట్ వెల్లడించలేదు. 1902లో మార్కెట్లోకి వచ్చిన తర్వాత 'O 10' రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ 128,800 యూరోలు(రూ.1.28 కోట్ల)కు అమ్ముడవడం ఇదే మొదటిసారి అని సిల్వర్ స్టోన్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.