Chicken In Coffee: ఉరుకుల పరుగుల జీవితాల్లో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్స్(Online Food Order)పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. వంట చేసుకునే సమయం లేక... కాఫీ దగ్గర నుంచి పిజ్జా వరకు అన్ని ఆర్డర్ పెట్టుకుని ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఎన్నో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు రోజుకోకటి పుట్టుకొస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఆర్డర్ సమయానికి రాకపోవడం, శుభ్రంగా ఉండకపోవడం, ఆర్డర్ తారుమారు అవ్వడం వంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఆర్డర్ చేసిన వంటకాల్లో ఏదో ఒకటి బల్లి, కీటకాలు ఇలా ఏదొకటి ప్రత్యక్షమవుతున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల చికెన్ లో ప్లాస్టిక్ రబ్బరు వచ్చిన సంగతి పూర్తిగా మరువక ముందే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కాఫీ తాగి, తీరిగ్గా రిలాక్స్ అవుదామని భావించిన ఓ వ్యక్తికి జొమాటో(Zomato)ఝలక్ ఇచ్చింది. కాఫీ ఆర్డర్ చేస్తే.. దానితో పాటు అతనికి చికెన్ ముక్క కూడా వచ్చింది. . ఆ విషయం గుర్తించని ఆ వ్యక్తి, ఆయన భార్య కాఫీని తాగేశారు. చివరిలో కాఫీ కప్పులో చికెన్ ముక్క ఉండటం చూసి వారిద్దరూ షాకయ్యారు. ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది,
ఢిల్లీకి చెందిన సుమిత్ అనే వ్యక్తి...ఢిల్లీలో ఉన్న థర్డ్ వేవ్ ఇండియా అనే తన రెగ్యులర్ ప్లేస్‌లో ఒకదాని నుంచి జొమాటో ద్వారా కాఫీ ఆర్డర్ చేశారు. వచ్చిన కాఫీని అతను, అతను భార్య ఇద్దరు తాగేశారు. అయితే చివరిలో అందులో ఓ చికెన్ ముక్క కనిపించింది. సుమిత్ భార్య స్వతహాగా శాకాహారి కావడంతో ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. . వెంటనే తమకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని తెలియజేస్తూ.. సుమిత్ తన ట్విట్టర్ అకౌంట్లో ఫొటోలను షేర్ చేశాడు. . @zomato, @thirdwaveindia నుంచి కాఫీని ఆర్డర్ చేశాను.ఇది చాలా దారుణం. కాఫీలో ఒక చికెన్ ముక్క కనిపించింది. మీతో నా అనుబంధం ఈరోజుతో అధికారికంగా ముగిసింది అని పోస్ట్‌లో సుమిత్. ఇదే స్క్రీన్ షాట్ ను జొమాటోకు కూడా షేర్ చేయడంతో... జరిగిన పొరపాటుకు చింతిస్తూ క్షమాపణలు కోరింది. జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తికి ప్రో మెంబర్ షిప్‌ను అందిస్తామని ఆఫర్ చేసింది. అతని వివరాలను షేర్ చేయమని కోరింది. వీలైనంత త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను కూడా సుమిత్ పోస్ట్ చేశారు. సుమిత్ పెట్టిన పోస్ట్‌కి థర్డ్ వేవ్ కాఫీ కూడా స్పందించింది. హాయ్ సుమిత్... దీనికి మేము చాలా చింతిస్తున్నాం.. మిమ్మల్ని సంప్రదించేందుకు వివరాలను తెలియజేయమని అభ్యర్థిస్తున్నాం.. మా బృందం వీలైనంత త్వరగా సంప్రదిస్తుంది..ధన్యవాదాలు అని థర్డ్ వేవ్ రాసుకొచ్చింది.
Ordered coffee from @zomato , (@thirdwaveindia ) , this is too much .
— Sumit (@sumitsaurabh) June 3, 2022
I chicken piece in coffee !
Pathetic .
My association with you officially ended today . pic.twitter.com/UAhxPiVxqH
కాగా,నవరాత్రుల సమయంలోనూ తాము వెజ్ బిర్యానీని ఆర్డర్ చేశామన్న సుమిత్.. పూర్తిగా శాఖాహారులైన తమకు వెజ్ బిర్యానీకి బదులుగా చికెన్ బిర్యానీ పంపారని వాపోయారు. అప్పుడు కూడా అదే సాకు చెప్పారు. కానీ వారు ఏమీ చేయలేదు. అది రెస్టారెంట్ తప్పు అని తెలియజేస్తూ మరొక ట్వీట్ చేశారు సుమిత్. ట్విట్టర్ లో చేసిన అతని పోస్ట్ కు స్పందించిన పలువురు నెటిజన్లు, ఫుట్ డెలివరీ సంస్థ జొమాటోపై మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.