హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: వామ్మో.. బస్సు కిటికీలోకి దూసుకొచ్చిన పెద్ద పులి.. వైరల్ వీడియో..

OMG: వామ్మో.. బస్సు కిటికీలోకి దూసుకొచ్చిన పెద్ద పులి.. వైరల్ వీడియో..

దాడిచేస్తున్న పులి

దాడిచేస్తున్న పులి

Viral video: క్రూరమృగాలు ఉన్న సఫారీ గుండా పర్యటకులు బస్సులో వెళ్తున్నారు. ఇంతలో బస్సు డ్రైవర్ మెల్లగా కిటీకి ఓపెన్ చేశాడు. అప్పుడు ఊహించని సంఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

మనలో చాలా మంది అడవిలో సఫారీలకు వెళ్తుంటారు. అక్కడ.. క్రూరజంతువులు ఉంటాయి. అక్కడ.. పులులు, సింహాలు మొదలైన వాటికోసం ప్రత్యేకంగా ఎన్ క్లోజర్స్ ఉంటాయి. వాటిలో గుండా వెళ్లడానికి ప్రత్యేక మైన బస్సులు ఉంటాయి. అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఒక్కసారిగా జంతువులు దాడిచేయడం, పర్యటకులను గాయపర్చడం చేస్తుంటాయి. పర్యటకులకు కూడా జంతువులతో ఆసక్తిగా చూస్తుంటారు. వాటికి తమతో పాటు తీసుకెళ్లిన ఫుడ్ పెడుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా (Viral video)  మారింది.

పూర్తి వివరాలు.. అడవిలో గుండా బస్సు వెళ్తుంది. అప్పుడు డ్రైవర్ చేసిన పని ప్రస్తుతం వైరల్ గా మారింది. బస్సు డ్రైవర్ మెల్లగా కిటీకి తీశాడు. అప్పుడు కిటికీలో నుంచి ఒక పుల్లకు చికెన్ ముక్క పెట్టి పట్టుకున్నాడు. అక్కడ ఒక పులి తిరుగుతుంది. అది చికెన్ ముక్క ఉన్న పుల్లను చూసింది.వెంటనే పరిగెత్తుకుంటు వచ్చి.. అమాంతం కిటికివైపు దూకింది. పుల్లను నోటితో పట్టుకుంది. చికెన్ ముక్కలను మంచిగా నమిలేసి మింగింది. అతను భయంతో.. దాన్ని కిటికి మూయడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) లో  వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇవే వద్దనేది .., పొరపాటున.. కిటీకిలో నుంచి పులి దూరితే పరిస్థితి ఏంటని కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా క్లాస్ రూమ్ లో బాలికలకు రచ్చ రచ్చ చేశారు.

పూర్తి వివరాలు.. తరగతిలో బాలురు, బాలికలు కూర్చున్నారు. ఇంతలో వారి మధ్య మాట మాట పెరిగింది. అయితే.. ఒక బాలిక.. మరో అమ్మాయిని జుట్టుపట్టుకుని దాడిచేసింది. ఆ తర్వాత.. తిట్టుకుంటూ వీరికి మరికొందరు తోడయ్యారు. క్లాస్ లోనే ఒకరిపై మరోకరు దాడులు చేసుకుంటూ పొట్టుపొట్టు కొట్టుకున్నారు.

అక్కడున్న అబ్బాయిలు.. మాత్రం భయపడి దూరంగా వెళ్లిపోతున్నారు. నవ్వుతూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. అమ్మాయిలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారంటూ కామెంట్ లను పెడుతున్నారు.

First published:

Tags: Social Media, Tiger Attack, Viral Video

ఉత్తమ కథలు