Viral : ఈ ఫొటోలో ఉన్నది మనిషి కాదు.. ఎవరో అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోక మానరు..

ఈ ఫోటోలో ఉన్నది మనిషి కాదు.. (Image : Twitter)

ఫొటో మొదటిసారి చూడగానే ఇందులో ఏముంది? హాస్పిటల్ బెడ్ పై ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడు. అతడిని ఫొటో తీశారు అనిపిస్తుంది. కానీ అందులోని ప్రత్యేకత తెలిస్తే మాత్రం హవ్వా.. అని ఆశ్చర్యపోక మానరు.

  • News18
  • Last Updated :
  • Share this:
సోషల్ మీడియా విస్తృతితో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఓ ఫొటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఫొటో మొదటిసారి చూడగానే ఇందులో ఏముంది? హాస్పిటల్ బెడ్ పై ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడు. అతడిని ఫొటో తీశారు అనిపిస్తుంది. కానీ అందులోని ప్రత్యేకత తెలిస్తే మాత్రం హవ్వా.. అని ఆశ్చర్యపోక మానరు. ఇంతకీ ఈ ఫొటో ప్రత్యేకత ఏంటి? అనుకుంటున్నారా? అందులో బెడ్ పై పడుకొని ఉన్న వ్యక్తే.. అవును.. ఆ బెడ్ పై పడుకొని ఉన్న వ్యక్తి నిజమైన మనిషి కాదు.. అది ఓ కేక్..

ప్రస్తుతం మార్కెట్లో భిన్న రకాల కేకులు అందుబాటులో ఉన్నాయి. మనకు నచ్చిన విధంగా కేకులు తయారు చేయించుకునే అవకాశం ఉంది. అయితే, ఒక చెఫ్ మాత్రం అందరికంటే భిన్నంగా ఉండాలనుకున్నాడేమో కాని ఏకంగా మనిషి రూపంలో ఉన్న కేక్ తయారు చేశాడు. హాస్పిటల్ బెడ్ పై నవ్వుతున్న ఓ వ్యక్తి రూపంలో కేక్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ కేకుకు సంబంధించిన ఫోటోలు ఇప్పడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.





ఫోటోలను పరిశీలిస్తే.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి బెడ్ పై విశ్రాంతి తీసుకుంటూ ఉండగా.. అతడి పక్కన మందులు, క్యాండిల్ తో పాటు ఓ మహిళ చేతితో కేకు పట్టుకుని అతడికి తినిపిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి కాళ్లు, చేతులు, ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఉన్నప్పటికీ నవ్వుతూనే కనిపిస్తున్నాడు. ఇదెలా సాధ్యం అని అంతా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్కసారి తీక్షణంగా పరీక్షించి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది మనిషి కాదు, కేకు. కానీ, ఎవరైనా సరే ఈ ఫోటోను మొదట చూడగానే అచ్చం మనిషిలాగే ఉన్నాడని అనుకుంటారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ మనిషిని పోలిన కేకు చిత్రాలను ‘‘హర్రర్ 4 కిడ్స్” అనే ట్విట్టర్ హ్యాండిల్ నెటిజన్లతో పంచుకుంది. కాగా, బ్రిటన్ కి చెందిన ఒక కేకుల తయారీ నిపుణుడు వినూత్న ఆలోచనే ఈ మనిషిని పోలిన కేకు. అతడు వివిధ రూపాల్లో కేకును తయారు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడు మరింత భిన్నంగా ఆలోచించి ఏకంగా మనిషి రూపంలో హైపర్ రియలిస్టిక్ కేక్ ని తయారు చేశాడు. దీంతో ఈ చిత్రాలు ఇప్పుడు క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అచ్చం మనిషిలా కనిపిస్తున్న ఈ కేకును చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యపోతూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అచ్చం మనిషిలా కేకును తయారు చేసిన అతని నైపుణ్యాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం ఈ చిత్రం చూసి మొదట్లో తాము భయపడ్డామని, ఈ చిత్రాలు పీడకలలు తెస్తాయని అంటున్నారు. ఇంకొంతమంది ఇలా హాస్పిటల్ బెడ్ పై పేషెంట్ రూపంలో కేకు తయారు చేయడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Srinivas Munigala
First published: