Thrilling video : మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు.. ఇంట్లో పెద్దవాళ్లు.. రోడ్డుపై జాగ్రత్తగా వెళ్లు అని చెబుతారు. అప్పుడు మనం సరే అని చెబితే బాగుంటుంది. కానీ మనం.. "అబ్బా.. నాకు తెలుసుకదా.. అది కూడా చెప్పాలా" అని విసుక్కుంటూ వెళ్తాం. కానీ పెద్దవాళ్లు చెప్పేది ఎప్పుడూ మన మంచికోసమే. వాళ్లది అనుభవం. మనది తెలిసీ తెలియని వ్యక్తిత్వం. కాబట్టి.. వాళ్లు ఏది చెప్పినా.. ఒప్పేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లేటప్పుడు చుట్టూ చూసుకుంటూ వెళ్లాలి. ముందే కాదు.. వెనక, పక్క నుంచి వచ్చే వాహనాల్ని కూడా చూసుకోవాలి అని హెచ్చరిస్తోంది ఓ వీడియో.
Telugu Memes : సరదా నవ్వుల మీమ్స్.. టాలీవుడ్ అప్డేట్స్
ట్విట్టర్‌లోని @TheFigen_ అకౌంట్లో ఈ వీడియోని నవంబర్ 20, 2022న పోస్ట్ చేశారు. ఈ 17 సెకండ్ల క్లిప్‌ని ఇప్పటివరకూ 17 లక్షల మందికి పైగా చూశారు. ఇందులో ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై ఉన్నాడు. అతని తీరు చూస్తే.. ఏదో చిరాకులో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కాలితో నేలను తంతూ.. తన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఓ చోట కాసేపు నిలబడి.. తర్వాత పక్కకు వెళ్లాడు. అంతే.. అప్పటిదాకా అతను ఎక్కడ నిల్చున్నాడో.. అక్కడికి ఓ కారు దూసుకొచ్చింది. అతను అక్కడే ఉండి ఉంటే.. ప్రాణాలకే ప్రమాదమయ్యేది.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
It's called destiny! pic.twitter.com/9ttqPSKrc9
— Figen (@TheFigen_) November 20, 2022
ఈ వీడియో ఎంతో థ్రిల్ కలిగిస్తోందనీ.. అలర్ట్ చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. "విధి రాత కాదు.. దైవమే అతన్ని కాపాడింది" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "ఇది ఫేక్ అయ్యుంటుంది. ఎందుకంటే.. కెమెరాని ముందే సెట్ చేసి పెట్టారనిపిస్తోంది" అని మరో యూజర్ స్పందించారు. "దేవుడు లేడని ఎవరన్నారు" అని మరో యూజర్ కామెంట్ రాశారు.
"మనమంతా చాలా కాలం బతుకుతామని అనుకుంటాం. కానీ జరిగే పరిణామాలు అంచనాకి అందని విధంగా ఉంటాయని మర్చిపోతాం. నెక్ట్స్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టే మనం ఇప్పుడు జీవిస్తున్నట్లుగా జీవించాలి. మన చుట్టూ ఉన్నవారిని ఆనందపరచాలి" అని మరో యూజర్ స్పందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending video, VIRAL NEWS, Viral Video