Harry Potter: హ్యారీపోటర్ ఫస్ట్ ఎడిషన్‌ను అమ్ముతున్న మరో ‘హ్యారీ పోటర్’.. ఎన్ని లక్షలకో తెలుసా?

హ్యారీ పోటర్ బుక్‌తో హ్యారీ పోటర్

Harry Poter: ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌కు చెందిన 33 ఏళ్ల హ్యారీ పోటర్ ఈ పుస్తకాన్ని అమ్మడం ద్వారా వచ్చే డబ్బును తన తండ్రి అస్థికలను ఆఫ్రికాలో కలిపి రావడం కోసం ఉపయోగించనున్నాడు. ఎందుకంటే.. తన తండ్రి చివరి కోరిక అది.

  • Share this:
హ్యారీ పోటర్ ( Harry Potter) పుస్తకాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫస్ట్ ఎడిషన్‌ (Harry Potter First edition) కు సంబంధించిన పుస్తకాలు అయితే రూ. లక్షలు పోసినా దొరకవు. అవి అంత రేర్ కలెక్షన్. అందుకే హ్యారీ పోటర్ ఫస్ట్ ఎడిషన్‌కు చెందిన అరుదైన పుస్తకం ‘హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్’ను రూ.30 లక్షలకు అమ్మనున్నాడు ఒక వ్యక్తి. అతడి పేరు సైతం హ్యారీ పోటర్ కావడం విశేషం. తన తండ్రే అతడికి ఆ పేరు పెట్టాడట.

ఈ పుస్తకాన్ని హ్యారీపోటర్‌కు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి బహుమతిగా ఇచ్చాడట. ఆ వయసులో అతడికి ఆ పుస్తకం విలువ తెలియలేదు. ఇంగ్లండ్‌ (England)లోని హాంప్‌షైర్‌కు చెందిన 33 ఏళ్ల హ్యారీ పోటర్ ఈ పుస్తకాన్ని అమ్మడం ద్వారా వచ్చే డబ్బును తన తండ్రి అస్థికలను ఆఫ్రికాలో కలిపి రావడం కోసం ఉపయోగించనున్నాడు. ఎందుకంటే.. తన తండ్రి చివరి కోరిక అది. దాన్ని తీర్చడం కోసమే ఈ పుస్తకాన్ని వేలం వేస్తున్నట్టు హ్యారీ పోటర్ వెల్లడించాడు.

ఫ్లైఓవర్‌పై డ్యాన్స్ చేస్తూ వీడియో షూట్‌ చేసిన కమెడియన్.. తర్వాత ఏం జరిగిందంటే..

అక్టోబర్ 7న ఈ పుస్తకాన్ని డెర్బిషైర్‌లో ఉన్న హాన్సన్స్ ఆక్షనర్స్ ఆఫ్ ఎట్ వాల్ వద్ద వేలం వేయనున్నారు. హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ ఎడిషన్ మొదటి 500 కాపీలలో ఈ పుస్తకం ఒకటి. వాటిలో 200 పుస్తకాలను మాత్రమే బుక్ స్టోర్లకు పంపించగా మిగతా వాటిని లైబ్రరీలు, స్కూళ్లకు పంపించారు. అందుకే దీనికి అంత డిమాండ్ ఉంది.

Online Baby: ఆన్‌లైన్ ద్వారా గర్భం దాల్చిన ఇంగ్లండ్ మహిళ.. ఎలాగో తెలుసుకోండి..

అయితే హ్యారీ పోటర్ అనే పేరు అతడికి చాలా చిక్కులను తీసుకొచ్చిందట. ఎక్కడికెళ్లినా తన పేరు హ్యారీ అని చెబితే ఎవ్వరూ నమ్మేవారు కాదట. నమ్మకపోగా తనకు ఆ పేరు వల్ల చాలా సమస్యలు తీసుకొచ్చారట. ఓసారి ఫుట్ బాల్ ఆడే సమయంలో తన పేరు హ్యారీ పోటర్ అని చెప్పినందుకు రిఫరీ రెడ్ కార్డ్ చూపించి గేమ్ నుంచి బయటికి వెళ్లిపోవాలని హెచ్చరించాడట. తన భార్యను మొదటిసారి గ్రీస్‌లో చూసినప్పుడు కూడా తన పేరు హ్యారీ పోటర్ అని చెబితే నమ్మలేదట.

Viral video: బాలుడి తలపై గిన్నె పెట్టి హెయిర్ కటింగ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

“కానీ నాకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మాత్రం హ్యారీ పోటర్ తొలి సినిమా విడుదలైంది. అప్పుడు మా ఫ్యామిలీని బిగ్ బ్రేక్ ఫాస్ట్ టీవీలో గెస్టులగా పిలిచారు. అప్పుడు సినిమాలో నటించిన స్టార్లు గ్వెన్ స్టెఫానీ, బెన్ స్టిల్లర్‌ను నేను కలిశా..” అని హ్యారీ గుర్తు చేసుకున్నాడు.

హ్యారీ తండ్రి 2017లో క్యాన్సర్ తో చనిపోయాడు. ఆ తర్వాతే ఆ పుస్తకం విలువ కూడా అతడికి అర్థం అయింది. తన తండ్రి చివరి కోరికను తీర్చడం కోసం ఈ పుస్తకాన్ని వేలం వేసి దాని ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ఆఫ్రికా వెళ్లడానికి కేటాయిస్తానని హ్యారీ తెలిపాడు. మిగతా డబ్బును తన సోదరి కేటీ సిన్‌తో కలిసి పంచుకుంటానని వివరించాడు.
Published by:Shiva Kumar Addula
First published: