Home /News /trending /

MAN MAKING MANSION OF FREE LOVE FOR 8 WIVES CREATES TIME TABLE FOR ROMANCE PVN

వీడు మామూలోడు కాదు : 8 మందితో ఒకేసారి పెళ్లి..భార్యలతో శృంగారానికి టైమ్ టైబుల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Husband Time Table For Romance With 8 Wives : ఈ రోజుల్లో ఓ సామాన్యుడు భార్య(Wife)ను సంతోషంగా ఉంచడం కష్టంగా మారుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇదే సమయంలో ఒక సామాన్యుడు ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి(Marriage) చేసుకున్న తర్వాత పశ్చాత్తాపం చెందడం కూడా చాలా సార్లు చూస్తూనే ఉంటాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Husband Time Table For Romance With 8 Wives : ఈ రోజుల్లో ఓ సామాన్యుడు భార్య(Wife)ను సంతోషంగా ఉంచడం కష్టంగా మారుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇదే సమయంలో ఒక సామాన్యుడు ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి(Marriage) చేసుకున్న తర్వాత పశ్చాత్తాపం చెందడం కూడా చాలా సార్లు చూస్తూనే ఉంటాం. కానీ ప్రపంచంలోని కొంతమంది చాలా మంది మహిళలతో ఒకేసారి డేటింగ్ చేసి వారిని సంతోషంగా ఉంచుతారు. అయితే బ్రెజిల్(Brazil) దేశానికి చెందిన ఆర్థర్ ఓ ఉర్సో(Arthur O Urso)అనే మోడల్ మాత్రం డేటింగ్ కంటే నాలుగు అడుగులు ముందుకేసి ఏకంగా తొమ్మిది మంది మహిళలను పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించాడు. అతను ఈ తొమ్మిది మంది మహిళలను ఒకే ఫంక్షన్‌లో పెళ్లి చేసుకున్నాడు(Man Married 9 Woman). అయితే, వారిలో ఒకరు కొన్ని నెలల తర్వాత ఆర్థర్‌కు విడాకులు(Divorce) ఇచ్చారు. ఆమె తన భర్తను మిగిలిన వారితో పంచుకోవడానికి ఇష్టపడలేదని సమాచారం. ఇప్పుడు ఆర్థర్ మిగిలిన ఎనిమిది మంది భార్యలను సంతోషంగా ఉంచడానికి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భార్యలందరికీ సమానమైన ప్రేమను అందించాలనుకుంటున్న ఆర్థర్... తన భార్యల కోసం 700 చదరపు అడుగుల ఇంటిని నిర్మిస్తున్నాడు. త్వరలో అందరూ పెద్ద బంగ్లాకు మారతారు, దీనికి ఆర్థర్ "మాన్షన్ ఆఫ్ ఫ్రీ లవ్ అని పేరు పెట్టారు. అందులో అతని భార్యలకు కావలసినవన్నీ ఉంటాయి. ప్రస్తుతం అతను తన భార్యలకు అన్ని విలాసవంతమైన వస్తువులను అందిస్తున్నాడు.

శృంగారం కోసం టైమ్ టేబుల్
అయితే ఆర్థర్ యొక్క ఈ వివాహం బ్రెజిల్‌లో చట్టవిరుద్ధం. బ్రెజిల్ ఒకటి కంటే ఎక్కువ వివాహాలు గుర్తించబడవు. అయినప్పటికీ ఆర్థర్, అతని భార్యలు ఎలాంటి ఆందోళన చెందకుండా అందరూ కలిసి జీవిస్తున్నారు. ప్రతి భార్య సమానమైన ప్రేమను పొందాలని ఆర్థర్ ఆకాంక్షించారు. ఇందుకోసం ఆయన ఓ టైమ్ టేబుల్ తయారు చేశారు. ఏ భార్యతో ఎంత సమయం శృంగారంలో పాల్గొనాలి అనేది స్పష్టంగా రాసి ఉంది.



Shocking : దారుణం..గర్భిణీపై సామూహిక అత్యాచారం

పొరుగువారు సంతోషంగా లేరు
ఆర్థర్ తన విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తున్న ప్రాంతంలో నివసించే ప్రజలు బహుశా అతని నిర్ణయంతో సంతోషంగా ఉండకపోవచ్చు. అతడిని దెయ్యం అని పిలిచి ఇల్లు ఖాళీ చేయమని అతని ఇంటి గోడపై హెచ్చరిక ఉంది. కానీ ఆర్థర్ ఈ విషయాలన్నీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. అతను తన భార్యల అవసరాలను తీర్చడంపై దృష్టి పెడుతున్నాడు. తన ఇంటి గోడపై హెచ్చరిస్తూ రాసిన రాతలపై ఆర్థఱ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Brazil, Marriage

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు