హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: ముంగీసలే అతనికి స్నేహితులు .. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Viral video: ముంగీసలే అతనికి స్నేహితులు .. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

mongooses (Photo_Youtube)

mongooses (Photo_Youtube)

Viral video: ముంగీసలు వాసన చూస్తే పాములు ఇట్టే పసిగడతాయి. అలాంటి ప్రమాదకరమైన బల్లి జాతికి చెందిన జంతువుల్ని తన గుడిసె పక్కనే పెట్టుకొని పెంచుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Meerut, India

ప్రపంచంలో ఎన్నో రకాల వింతలు, విచిత్రాలు చూస్తుంటాం. ముఖ్యంగా పక్షులు, సాధు జంతువులతో పాటు వన్యప్రాణుల్ని తెచ్చి ఇళ్లలో పెంచుకునే వాళ్ల గురించి విన్నాం. కాని ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)మీరట్‌ సమీపంలో ఓ వ్యక్తి ఏకంగా ముంగీసల(Mongooses)ను పెంచుకుంటున్నాడు. వాటికి రోజు ఆహారం పెడుతూ వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే ముంగీసలు వాసన చూస్తే పాములు ఇట్టే పసిగడతాయి. అలాంటి ప్రమాదకరమైన బల్లి జాతికి చెందిన జంతువుల్ని తన గుడిసె పక్కనే పెట్టుకొని పెంచుకుంటున్న వీడియో (Video)ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే ముంగీసలను పెంచుకోవడం వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందంటున్నాడు ఈ ముంగీసల స్నేహితుడు మహంత్‌సాగర్ గిరిమహరాజ్. అసలు ఆ స్టోరీ ఏంటో చూడండి.

Delhi: డబ్లూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు .. మహిళా రెజ్లర్లు ఏమంటున్నారో వినండి

ముంగీసలతో దోస్తీ ..

ఇదీ హస్తినాపూర్ ఖాదర్ ప్రాంతంలోని తారాపూర్ గ్రామంలో ఉన్న సాగర్ కుటీకి చెందిన మహంత్ సాగర్ గిరి మహారాజ్ స్టోరీ ఇది. గత 12 సంవత్సరాలుగా ముంగీసలంటే మహంత్‌ సాగర్‌ మహరాజ్‌కి ఎంతో ఇష్టం. పాములకు బద్దశత్రువులుగా భావించే ముంగీసలు మాత్రం మహరాజ్‌ బాబాను గురువుగా భావిస్తున్నాయి. సాగర్ కుటీ తారాపూర్ గ్రామంలో ఉంది. శ్రీ శ్రీ 108 సాగర్ గిరి జునా అఖారా మహంత్ ఉన్న ప్రాంతం, ఇక్కడ గత 15 సంవత్సరాలుగా గుడిసె నిర్మించుకుని నివసిస్తున్నారు. 2010లో ఖాదర్ ప్రాంతంలో గంగా నదికి తీవ్ర వరద వచ్చినప్పుడు సుమారు 35గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. అదే సమయంలో తన గుడిసె చుట్టూ వరదనీరు చేరడంతో అర డజను ముంగీసలు వచ్చి గుడిసెలో తలదాచుకున్నాయని మహంత్ చెప్పారు. ముంగీసలకు తన గుడిసెలోనే ఆశ్రయం ఇచ్చి వాటికి ఆహారం పెట్టాడు. వరద నీరు తగ్గగానే ముంగీసలు తిరిగి అడవికి వెళ్లాయి.

వైరల్ అవుతున్న వీడియో..

పోయిన ముంగీసలు అడవిలో ఉండకుండా రోజూ మహంత్‌ నివసిస్తున్న గుడిసె దగ్గరకు రావడం మొదలుపెట్టాయి. ఈ విధంగా 12సంవత్సరాల నుంచి ముంగీసలు మహంత్ గుడిసె చుట్టూ తిరుగుతూ అతను పెట్టే ఆహారం తింటూ అతనికి మంచి స్నేహితులుగా మారాయి. ఈక్రమంలోనే ఒక పెద్ద నాగుపాము తన గుడిసె వద్దకు వచ్చిందని, అది చూసి తాను భయపడి, అరవడంతో, రోజూ మాదిరిగానే, ముంగీసలు పరుగెత్తుకుంటూ వచ్చి నాగుపామును గుడిసె దగ్గర నుంచి తరిమివేశాయని..ఆ విధంగా తన ప్రాణాలు కాపాడయని ముంగీసలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నాడు మహంత్. అంతే కాదు తన దగ్గరు ఎలాంటి వన్యప్రాణులు, ప్రాణహాని కలిగించే జంతువులు వచ్చినా గట్టిగా అరిస్తే చాలు ముంగీసలు తాను ఉంటున్న కుటీరం దగ్గరకు వచ్చి రక్షణగా ఉంటున్నాయని తెప్పారు మహరాజ్.

అరుదైన స్నేహం..

నాగుపాము నుంచి మహంత్ ప్రాణాలు కాపాడిన నాటి నుంచి వాటికి గురువుగా కాకుండా ముంగీసలకు ఫ్రెండ్‌గా మారిపోయాడు మహంత్‌. ముంగీసలు కూడా బాబాతోనే జీవిస్తున్నాయి. బాబాను చూడగానే ముంగీసలు పరుగులు పెడుతూ వస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విచిత్రమైన స్నేహాన్ని చూసి హస్తినాపూర్‌లో నివసిస్తున్న వారితో పాటు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

First published:

Tags: Trending news, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు