హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా అని ChatGPTని అడిగాడు.. ఒక్కరోజులో కంపెనీ పెట్టి లక్షాధికారి అయ్యాడు

ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా అని ChatGPTని అడిగాడు.. ఒక్కరోజులో కంపెనీ పెట్టి లక్షాధికారి అయ్యాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

How to earn more money : ఈ రోజుల్లో స్టార్టప్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. స్టార్టప్ లు స్థాపించి కొందరు కొన్ని నెలల్లోనే కోటీశ్వరులు అవుతుండటం చూశాం

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

How to earn more money : ఈ రోజుల్లో స్టార్టప్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. స్టార్టప్ లు(Startups) స్థాపించి కొందరు కొన్ని నెలల్లోనే కోటీశ్వరులు అవుతుండటం చూశాం. అయితే ఒక్క రోజులో లక్షల విలువ చేసే కంపెనీని నిర్మించానని ఎవరైనా చెబితే నమ్ముతారా? కానీ అది జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఓ వ్యక్తి ఈ అద్భుత విజయం సాధించాడు. అతను చేసినదంతా.. మరింత డబ్బు ఎలా సంపాదించాలి? అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్ జీపీటీని(ChatGPT)అడిగాడు. ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానంతో అతను ఆశ్చర్యపోయాడు. దాని సాయంతో ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నాడు.

జాక్సన్ ఫాల్ అనే వ్యక్తి తాజాగా తన జీవితంలో జరిగిన అద్భుతమైన విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు. జాక్సన్ ఫాల్ ట్విట్టర్ లో షేర్ చేసిన తన స్టోరీలో.." గతంలో ChatGPT గురించి చాలా చర్చలు విన్నాను. ప్రతి ప్రశ్నకు చాట్ జీపీటీ దగ్గర సమాధానం ఉందని కూడా చెప్పబడింది. గేమ్ ప్లేలో నేను ChatGPT-4 AI బాట్‌ని లోడ్ చేశాను. మీ దగ్గర 100 డాలర్లు మాత్రమే ఉంది..కానీ మీ లక్ష్యం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం మరియు అది కూడా తప్పు చేయకుండా, అప్పుడు మార్గం ఏమిటి అని చాట్ జీపీటీని అడిగాను. దీనికి చాట్ జీపీటీ ఓ సమాధానం ఇచ్చింది. దీని ద్వారా మీకు కావలసినంత సంపాదించవచ్చు అని ChatGPT తెలిపింది. నేను ఆశ్చర్యపోయాను, ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను మరియు అది నాకు చెబుతూనే ఉంది. ముందుగా వెబ్‌సైట్‌ను రూపొందించాలని అని చాట్ జీపీటీ సూచించింది. వెబ్‌సైట్ ఎలా ఉండాలి, ఏయే ఆర్టికల్స్ ఉండాలి అని కూడా చాలా హెల్ప్ చేసింది. చాట్ జీపీటీ నాకు GreenGadgetGuru.com అనే డొమైన్ పేరును కూడా సూచించింది. ఇది మీకు పర్యావరణం పట్ల అనుబంధాన్ని కలిగిస్తుంది. తర్వాత ఓ గొప్ప లోగోని ఎంచుకుని ఇచ్చింది. బ్రాండింగ్ పద్ధతులను కూడా నేర్పించింది. కస్టమర్ల డిమాండ్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఉంచాలని కూడా చెప్పబడింది. ఆ ఉత్పత్తుల గురించి కూడా చెప్పింది. సోషల్ మీడియాలో పెట్టండి అని కూడా చాట్ జీపీటీ చెప్పింది. చాట్ జీపీటీ చెప్పిన మెసేజ్‌లన్నింటినీ నేను ఫాలో అయ్యాను"అని తెలిపాడు.

GPT-4 Model: దృష్టి లోపం ఉన్నవారికి సరికొత్త ఫీచర్‌ అందిస్తున్న జిపిటి-4.. ఇదెలా పని చేస్తుందంటే?

పెట్టుబడి కూడా తెచ్చింది

రెండు రోజుల క్రితమే మార్చి 15న కంపెనీ ఏర్పడిందని,ఒక్క రోజులో కంపెనీ నిలబడిందని జాక్సన్ చెప్పారు. పెట్టుబడి ఎలా వస్తుందో చాట్‌జీపీటీ చెప్పిందని.. ఈ రోజు తన సంస్థకు చాలా మంది పెట్టుబడిదారులు ఉన్నారు మరియు కంపెనీ మార్కెట్ విలువ 25,000 డాలర్లు దాటిందని తెలిపాడు. కంపెనీ వద్ద ప్రస్తుతం 1378.84 డాలర్లు ఉన్నట్లు జాక్సన్ తెలిపాడు. కంపెనీ పెట్టిన ఒక రోజు తర్వాత, వీలైనంత త్వరగా 100,000 డాలర్ల విలువైన నగదును కలిగి ఉండటం ఎలా అని జాక్సన్ ChatGPTని కోరాడు. దీని తర్వాత ఇన్వెస్టర్ల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. జాక్సన్‌కి ఇది తొలిరోజులే అయినా.. అతని వ్యాపారం సాగుతున్న వేగాన్ని చూస్తుంటే.. త్వరలోనే కోటీశ్వరుడు అవుతాడని చెప్పొచ్చు.

First published:

Tags: Artificial intelligence, Chatgpt, Earn money

ఉత్తమ కథలు