Home /News /trending /

MAN LOST HIS LIFE FOLLOWING SOMEONE WARNED HOME TO OUST HIS PET DOG SNR

కుక్క కోసం మధ్యప్రదేశ్‌లో వ్యక్తి ఏం చేశాడో తెలుసా..విడిచి ఉండలేక సూసైడ్

DOG OWNER SUICIDE

DOG OWNER SUICIDE

Madhya Pradesh: విశ్వాసం వాళ్లద్దరిలో ఉంది. కుక్కను ఇంట్లోంచి తరిమివేయని తల్లి అన్నదని దాన్ని వదిలేయలేక ప్రాణాలు తీసుకున్నాడు యజమాని. తనను పెంచుతున్న యజమాని లేడని తెలిసి ఆ శునకం చూపించిన మూగప్రేమ అందర్ని కన్నీళ్లు పెట్టించింది. ఈఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

ఇంకా చదవండి ...
పెంపుడు కుక్కలంటే చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది. తాము ముద్దుగా పెంచుకుంటున్న కుక్కలకు ఏమైనా అయినా...వాటిని ఎవరైనా ఏమన్నా అంటే అసలు తట్టుకోలేరు. కొందరైతే తాము పెంచుకున్న కుక్క దూరమైనప్పుడు వాటిని మర్చిపోలేక జ్ఞాపకాల్ని నెమరవేసుకుంటూ రోజుల పాటు తిండి, తిప్పలు మానేస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లో మాత్రం ఇందుకు రివర్స్‌లో జరిగింది. ఛత్తర్‌పూర్‌(Chattarpur) లోని విశ్వనాథ్‌ కాలనీలో జరిగింది. 38ఏళ్ల వ్యక్తి ఓ కుక్క (Dog)ను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే ఆ కుక్కతో అతనికి విడదీయలేని బంధం ఏర్పడింది. అతను ఎటు వెళ్లినా అది తోడుగా వెళ్లడం, నిద్రపోతున్న సమయంలో అతనికి కాపలా ఉండటం చేస్తూ ఉండేది. ఇలా శునకానికి అతను ఇస్తున్న ప్రాధాన్యత, అది కూడా అతనిపై చూపిస్తున్న విశ్వాసం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే ఇంట్లో ఉంటున్న అతని తల్లి కుక్కను ఎందుకు పెంచుకోవడం..బయట వదిలేయమని చెప్పంది. దానికి ఆ కుక్క తన యజమాని తల్లి చేతిని కరిచింది. కుక్క దాడిలో వృద్ధురాలు యపడింది. ఇంట్లో ఉన్న తల్లికి నచ్చచెప్పలేక..కుక్కను తరిమివేయడం ఇష్టం లేని ఆ వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పెంచుకుంటున్న కుక్క లేకుండా ఉండటం కష్టమని భావించి ఉరి వేసుకొని ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఒక మూగజీవి కోసం తల్లితో గొడవ పడలేక..దాన్ని బయటకు తరిమివేయలేక మనిషి ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది.

శునకం కోసం సూసైడ్ ..
తనను ఆదరించి, అక్కున చేర్చుకొని పోషిస్తున్న యజమాని లేడన్న వార్తను ఆ శునకం కూడా జీర్ణించుకోలేకపోయింది. ఉరి వేసుకొని చనిపోయిన యజమాని శవం చుట్టూ చక్కర్లు కొట్టడం, అతడ్ని పలకరించాలన్న ప్రయత్నం చేసింది. తన నోరు, కాళ్లతో అతడి ప్యాంట్‌ను లాగాడం వంటివి చేసింది. మూగజీవి కోసం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసుకోవడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ శునకం చనిపోయిన యజమాని మృతదేహం దగ్గర నుంచి కదలకపోవడం, అది చూపించిన ప్రేమానురాగాన్ని చూస్తూ స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

పెంపుడు కుక్కను వదిలి ఉండలేక..
జనంలో నమ్మకం, విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతూ వస్తున్నాయి. కాని మూగజీవాల్లో మాత్రం తగ్గడం లేదు పట్టెడన్నం పెట్టి ఆదరిస్తున్న యజమానుల పట్ల శునకాలు ఇంత ప్రేమగా ఉంటాయా అని ఛత్తర్‌పూర్‌ ఘటన రుజువు చేసింది. అందుకే వేలు, లక్షలు పోసి  కుక్కల్ని పెంచుకుంటున్నారు చాలా మంది. వాటిని కన్నబిడ్డల కంటే ప్రేమగా ఆదరించి పోషించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు వాళ్లు అలా చేయడంలో తప్పు లేదనే భావన కలగడం సహజం.
Published by:Siva Nanduri
First published:

Tags: Dog, Madhya pradesh, Suicide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు