హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Weight : లావుగా ఉన్నాడని లవర్ బ్రేకప్..139 కిలోల నుంచి 69 కిలోలకు ప్రియుడు దిమ్మతిరిగే షాక్

Weight : లావుగా ఉన్నాడని లవర్ బ్రేకప్..139 కిలోల నుంచి 69 కిలోలకు ప్రియుడు దిమ్మతిరిగే షాక్

అలా ఉండే  పువి ఇలా మారిపోయాడు

అలా ఉండే పువి ఇలా మారిపోయాడు

Overweight man loses 70 kgs : ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు(Overweight)తో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా తమ దినచర్యలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. బరువు తక్కువగా(Under Weight)ఉన్నవారితో పోలిస్తే యాక్టివ్ గా ఉండకపోవడం, బట్టలు సరిగ్గా అమర్చకపోవడం, త్వరగా అలసట రావడం, అనేక వ్యాధులు చుట్టుముట్టడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం మొదలైన ఇబ్బందులను ఊబకాయస్తులు ఎదుర్కొంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Overweight man loses 70 kgs : ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు(Overweight)తో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా తమ దినచర్యలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. బరువు తక్కువగా(Under Weight)ఉన్నవారితో పోలిస్తే యాక్టివ్ గా ఉండకపోవడం, బట్టలు సరిగ్గా అమర్చకపోవడం, త్వరగా అలసట రావడం, అనేక వ్యాధులు చుట్టుముట్టడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం మొదలైన ఇబ్బందులను ఊబకాయస్తులు ఎదుర్కొంటారు. సైన్స్ ప్రకారం...అధిక బరువు అనేది వ్యక్తి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కాగా, తాజాగా బాగా లావుగా ఉన్నాడని ఓ యువకుడికి అతని గర్ల్‌ఫ్రెండ్‌ బ్రేకప్(Girlfriend Brakup)చెప్పేసింది. ఈరోజుల్లో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు... అందం, డబ్బులు, ఫిట్నెస్ చూసి లవ్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. కొంతకాలం ప్రేమించుకోగానే ఏదో ఒక సిల్లీ కారణాలు చెప్పుకుని చాలా మంది బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఒకటి వెలుగుచూసింది.


పువి(Puvi) అనే టిక్‌టాక్ యూజ‌ర్ త‌న వ‌ర్క‌వుట్ వీడియోల‌ను త‌ర‌చూ షేర్ చేస్తుండే వాడు. ఈ క్రమంలోనే తన వెయిట్‌ లాస్‌ జర్నీని అతను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అతని స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral news)మారింది. వీడియోలో పువి చెప్పిన వివరాల ప్రకారం...రెండేళ్ల క్రితం అధిక బ‌రువుతో బాధపడుతున్న పువిని అదే కార‌ణంతో అతడి ప్రియురాలు విడిచిపెట్టింది. ప్రియురాలు బ్రేకప్‌ చేప్పడంతో పువి చాలా కుంగిపోయాడు. మాటలతో ఆమెను మార్చాలని, నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ పువి మాటలు వినేందుకు కూడా ఆమె ఇష్టపడలేదు. దీంతో పువి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు తన శరీరాకృతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీన్ని చాలెంజ్‌గా స్వీకరించాడు. అనుకున్నట్లుగానే జిమ్‌కు వెళ్లి వర్కౌట్‌ చేయడం ప్రారంభించాడు. క్రమంగా శరీరంలో మార్పును చూడటం ప్రారంభించాడు.Sonali Phogat : బీజేపీ లీడర్,టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మృతి..మరణానికి కొన్ని గంటల ముందే..


ప్రియురాలు బ్రేకప్‌ చెప్పినప్పుడు 139 కిలోల బరువు ఉన్న పువి... 18 నెలలు కఠిన వ్యాయామం చేసి బరువు 70 కిలోల బరవు తగ్గాడు. ప్రస్తుతం పువి బరువు 70 కిలోలు. పువి త‌ర‌చూ షేర్ చేస్తుండే వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ స్టోరీ వెలుగుచూసింది. ట్రిపుల్‌ ఎక్స్‌ఎల్‌ సైజ్‌ నుంచి స్మాల్‌ సైజ్‌కు మారిపోయిన ఫువి కృషి, పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్ఠూలకాయం నుంచి ఫిట్‌గా మారిన అతడు చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు అంటూ నెటిజన్లు పువిని ప్రశంసిస్తున్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Viral in internet, Weight loss

ఉత్తమ కథలు