హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: కారులో భర్త చేసిన పనికి షాకైన భార్య! ఎందుకీ ఎక్స్‌ట్రాలు..

Viral Video: కారులో భర్త చేసిన పనికి షాకైన భార్య! ఎందుకీ ఎక్స్‌ట్రాలు..

కారులో ఇన్‌స్టా రీల్స్‌(Screengrab Twitter/RoadsOfMumbai)

కారులో ఇన్‌స్టా రీల్స్‌(Screengrab Twitter/RoadsOfMumbai)

కార్లలో ADAS ఫీచర్ దుర్వినియోగానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టెక్నాలజీని ఎలా పడితే అలా వాడితే అసలకే ఎసరు వస్తుంది. సాంకేతికతను మిస్‌ యూజ్‌ చేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటుగా కార్లలో సేఫ్టీ ఫీచర్లు కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. నేటి ఆధునిక కార్లలో ఎక్కువగా వినిపించే టెక్నాలజీ అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌(ADAS). దీనినే అడాస్ అని కూడా పిలుస్తుంటారు. అయితే దీన్ని కారు నిడిపే వాళ్లు దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో చూస్తే ఈ విషయం క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది. స్టీరింగ్‌(steering) వదిలేసి ఓ కపుల్ రీల్స్‌ చేస్తున్న ఓ వీడియో వైరల్‌గా మారింది.

ఇంత షో ఎందుకంటూ నెటిజన్ల విమర్శలు:

ఓ కపుల్ కారులో ప్రయాణిస్తున్నారు. అది అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌(ADAS) కారు. మహీంద్రా ఎక్స్ యూవీ 700 కారు స్టీరింగ్ వీల్‌ను వదిలేసి తన భార్యతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేశాడు ఈ భర్త. కార్లలో ADAS ఫీచర్ దుర్వినియోగానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. రీల్స్‌ చేయడంలో కూడా అతని ఓవరాక్షన్‌ పీక్స్‌కు వెళ్లిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భార్యతో సరదాగా దెబ్బలాడడం తర్వాత.. కాళ్ల మీద కాళ్లు వేసుకోని ఓ ఫోజ్‌ ఇచ్చాడు. దీని చూసి నెటిజన్లకు మరింత మండిపోయింది.. డబ్బులున్నాయ్‌.. ADAS కారు ఉంది.. నేనేదో తోపుని అన్నట్లు ఉందీ ఆ ఎక్స్‌ప్రెషన్‌. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నవాళ్లే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని.. తప్పు లేకుండా కూడా యాక్సిడెంట్స్‌లో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని.. ఇలాంటి సమయంలో ఇలాంటి రీల్స్‌ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌:

ఒకప్పుడు ఈ తరహా ఆటోమేటిక్ టెక్నాలజీ కేవలం హై-ఎండ్ ప్రీమియం కార్లలో మాత్రమే లభించేది. అయితే.. అధిక డిమాండ్ కారణంగా, ఇప్పుడు ఇది ఎంట్రీ లెవల్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీలో డ్రైవర్ ప్రమేయం లేకుండా కారులో ఉండే కంప్యూటర్, కారులో అమర్చిన వివిధ రకాల సెన్సార్లు కలిసి పనిచేస్తాయి. ఈ టెక్నాలజీ ఆటోమేటిక్‌గా అత్యవసరం అనుకున్న చోట బ్రేక్ వేస్తుంది. ఇక కారును ఓ సరైన పాత్‌లో మాత్రమే నడిచేలా చేస్తుంది. ఇదొక్క ఫీచర్ మాత్రమే కాదు, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే కొల్లైజన్ అవైడెన్స్, డ్రైవర్ లైన్ మారకుండా ఒకే లైనులో ప్రయాణించేలా ఉపయోగపడే లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ నిద్రపోతున్నాడని గుర్తించి అలెర్ట్ చేసే డ్రైవర్ డ్రౌజీనెస్ సిస్టమ్ ఇలా చెప్పుకుంటూపోతే అడాస్ ఫీచర్ల జాబితా చాలానే ఉంది. ఇలాంటి అధునాతన ఫీచర్లతో కూడిన కార్లు ఇటీవలి కాలంలో దేశంలో బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఇలా కొంతమంది దీన్ని దుర్వినియోగం చేసుకుంటుండడం ప్రజల్లోకి రాంగ్‌ మెసేజ్‌ తీసుకెళ్లినట్లువుతుంది.

First published:

Tags: CAR, Instagram reel, Viral Videos

ఉత్తమ కథలు